దేశంలోని అతిపెద్ద బ్యాంకుగా ఎస్బీఐ కొననసాగుతోంది. ఈ బ్యాంకుకు 40 కోట్లకు పైగా ఖాతాదారులు ఉన్నారు. దీంతో సైబర్ నేరగాళ్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లను టార్గెట్ చేస్తున్నారు. పలువురు ఎస్బీఐ ఖాతాదారులకు పాన్‌ను అప్‌డేట్ చేసుకోవాలని కోరుతూ మెసేజ్ లు వస్తున్నాయి. "ప్రియమైన కస్టమర్, ఈ రోజు మీ SBI YONO ఖాతా మూసివేశాం. ఇప్పుడే సంప్రదించండి. మీ పాన్ నంబర్ వివరాలను అప్‌డేట్ చేయండి"అని మెసేజ్ పంపుతున్నారు. అయితే ఈ సందేశాలు ఫేక్ అని పీఐబీ స్పష్టం చేసింది. ఇలాంటి సందేశాలను నమ్మొద్దని కోరింది.
పీఐబీ ఫ్యాక్ట్ చెక్
ఈ మేరకు పీఐబీ ఫ్యాక్ట్ చెక్ ట్వీట్ చేసింది. ఎస్బీఐ పేరుతో ఫేక్ మెసేజ్ వస్తున్నాయని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ పేర్కొంది. సందేశంలో కస్టమర్లు తమ ఖాతా బ్లాక్ చేయబడకుండా ఉండటానికి వారి పాన్ నంబర్‌ను అప్‌డేట్ చేయమని కోరుతున్నారని తెలిపింది. "SBI పేరుతో జారీ చేయబడిన ఒక నకిలీ సందేశం, ఖాతాదారుల ఖాతా బ్లాక్ చేయబడకుండా ఉండటానికి వారి పాన్ నంబర్‌ను అప్‌డేట్ చేయమని అడుగుతోంది" అని PIB ఫ్యాక్ట్ చెక్ చేసిన తాజా ట్వీట్ తెలిపింది.

ఎప్పుడూ స్పందించకూడదు
ప్రజలు తమ వ్యక్తిగత లేదా బ్యాంకింగ్ వివరాలను షేర్ చేయమని అడిగే ఇమెయిల్‌లు/SMSలకు ఎప్పుడూ స్పందించకూడదని PIB హెచ్చరించింది. ప్రజలు అటువంటి నకిలీ సందేశాలను [email protected]లో నివేదించవచ్చని PIB తెలిపింది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications