Income Tax: ఇకపై వృద్ధులు ఆదాయపు పన్ను చెల్లించక్కర్లేదు..! పూర్తి వివరాలివే..
Tax News: దేశంలో పన్ను చట్టాల ప్రకారం నిర్థేశించిన ఆదాయం కంటే ఎక్కువ సంపాదిస్తున్న ప్రతి ఒక్కరూ సంబంధిత టాక్స్ స్లాబ్ రేట్ల ప్రకారం వార్షిక పన్ను చెల్లించాల్సి ఉంటుందని అందరికీ తెలిసిందే. అయితే ఇకపై దేశంలో 75 ఏళ్లు పైబడిన వ్యక్తులు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదనే వార్తలు వైరల్ అవుతున్నాయి. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక సర్క్యులర్ రిలీజ్ అయ్యిందని ఒక పోస్ట్ ఇంగ్లీషులో వైరల్ అవుతోంది.
భారతదేశ పన్ను వ్యవస్థలో మార్పులకు సంబంధించిన ఒక సందేశం అనేక సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో తెగ వైరల్ అవుతోంది. జనాభాలోని ఒక వర్గానికి పన్నులు చెల్లించకుండా కేంద్ర ప్రభుత్వం మినహాయింపును ప్రకటించినట్లు అందులో పేర్కొనబడింది. అయితే ఈ వార్తలో ఎలాంటి నిజం లేదని తేలింది. ఈ విషయంలో అసలు నిజానిజాలను బయటకు తీసుకొచ్చేందుకు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వైరల్ పోస్ట్‍పై ఫ్యాక్ట్ చెక్ నిర్వహించింది. విచారణలో ఈ మెసేజ్ ఫేక్ అని తేలింది. PIB ఇలా వ్రాసింది.. 'భారతదేశం స్వాతంత్ర్యం 75వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నందున, 75 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లు ఇకపై పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న సందేశం పూర్తిగా నకిలీది' అని వెల్లడించింది.

వైరల్ అవుతున్న సందేశాన్ని పరిశీలిస్తే.. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ అందించిన సమాచారం ప్రకారం కేంద్ర ప్రభుత్వం 75 ఏళ్లు దాటిన సీనియర్ సిటిజన్లను పన్ను నుంచి మినహాయిస్తూ అందుకోసం చట్టసవరణలు చేపట్టిందని కొన్ని సెక్షన్లను మెన్షన్ చేశారు. ఈ ప్రయోజనాన్ని పొందటానికి సీనియర్ సిటిజన్లు ముందు 12 బీబీఏ అప్లికేషన్ బ్యాంకులకు అందించటం ద్వారా టాక్స్ ఎగ్జెమ్షన్ పొందుతారని సూచించబడింది.
75 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లు వారి ఆదాయం పెన్షన్, వడ్డీ ద్వారా మాత్రమే ఉంటే వార్షిక పన్ను రిటర్న్ ఫైల్ చేయటం నుంచి మినహాయింపును కలిగి ఉన్నారని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(PIB) తెలిపింది. అలాగే ఏదైనా పన్ను వర్తింపజేస్తే, ఆదాయాన్ని లెక్కించి, అర్హత కలిగిన తగ్గింపులు చేసిన తర్వాత నిర్ణీత బ్యాంకు ద్వారా తీసివేయబడుతుందని వెల్లడించింది.


Click it and Unblock the Notifications