దేశీయ ఔషధ కంపెనీలు అమెరికాలో న్యాయవివాదంలో చిక్కుకున్నాయి. ఇండయాకు చెందిన 3 ఫార్మా కంపెనీలు సహా వివిధ దేశాలకు చెందిన మొత్తం 26 కంపెనీలు ఇందులో ఉన్నాయి. మన దేశానికి చెందిన అరబిందో ఫార్మా, లుపిన్, సన్ ఫార్మాలు ఉన్నాయి. ఈ వ్యాజ్యం మేరీలాండ్ అటార్నీ జనరల్ కనెక్టికట్ జిల్లా కోర్టులో ఈ లాసూట్ దాఖలు చేశారు. ఈ న్యాయ వివాదంలో బ్రియాన్ ఈ ప్రోష్‌తో పాటు అమెరికాలోని ఇతర రాష్ట్రాల అటార్నీ జనరల్స్ కూడా కలిశారు.

మార్కెట్ అక్రమాల ఆరోపణలు
అమెరికాలో ఔషధ అమ్మకాల్లో అక్రమ విధానాలకు పాల్పడ్డారంటూ దాఖలైన ఓ దావాలో అరబిందో, లుపిన్, సన్ ఫార్మా సంస్థల పేర్లు ఉన్నాయి. ధరలను కృత్రిమంగా పెంచి, మార్కెట్లో పోటీని తగ్గించి అసమంజసంగా వాణిజ్యాన్ని నిరోధిస్తూ కుట్ర చేసి అమెరికావ్యాప్తంగా ఔషధాలను అమ్ముకున్నారని అటార్నీ జనరల్ బ్రియాన్ ఈ ప్రోష్ అందులో పేర్కొన్నారు.

అమెరికాకు భారీ నష్టం
80 రకాల జనరిక్ ఔషధాల మార్కెటింగ్, అమ్మకాల్లో 26 సంస్థలు, పదిమంది వ్యక్తులు అవకతవకలకు పాల్పడినట్లు బ్రియాన్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కుట్రతో అమెరికాకు బిలియన్ డాలర్ల మేర ఆదాయం దూరమైందని ఆరోపిస్తున్నారు. ఈ కంపెనీల నుండి నష్టపరిహారం వసూలు చేయడంతో పాటు వాటికి భారీగా పెనాల్టీలు విధించాలని, మళ్లీ ఔషధ మార్కెట్లో పోటీ పరిస్థితులు ఏర్పడే విధంగా చర్యలు తీసుకోవాలని కంపెనీలకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. తద్వారా జనరిక్ ఔషధ మార్కెట్లో కొరవడిన పోటీ వాతావరణాన్ని తిరిగి పెంపొందించాలని కోరుతున్నారు.

గుప్పిట్లో మార్కెట్
ఈ కంపెనీల ప్రతినిధులు వివిధ సందర్భాల్లో పరస్పరం కలుసుకుంటూ చట్ట వ్యతిరేక ఒప్పందాలు కుదుర్చుకొని, మార్కెట్‌ను తమ గుప్పిట్లో పెట్టుకునే చర్యలపై కసరత్తు చేసి, వాటిని అమలు చేయడానికి సిద్ధమయ్యారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో అమెరికాలోని రోగులకు, మేరీలాండ్ రాష్ట్రానికి, ఆరోగ్య బీమా సంస్థలకు బిలియన్ల డాలర్ల నష్టం వాటిల్లుతోందని పేర్కొన్నారు. అమెరికా చరిత్రలో అతిపెద్ద కార్పోరేట్ కార్టెల్ కేసు ఇదే కావొచ్చునని కూడా బ్రియాన్ ఈ పోష్ తెలిపారు. కాగా, ఇప్పటికే కొనసాగుతున్న విచారణకు తోడు తాజాగా వేసిన దావా మూడోది. కంపెనీలు ఏకమై ఇలా ధరలు పెంచిన కేసు అమెరికా చరిత్రలో పెద్దది అంటున్నారు.

దావాలో ఈ రాష్ట్రాలన్నీ కలిశాయి
ఈ దావాలో మేరీలాండ్ అటార్నీ జనరల్‌తో పాటు అలబామా, అలస్కా, అరిజోనా, అర్కన్సాస్, కోలరాడో, కనెక్టికట్, డేల్వేర్, ది డిస్ట్రిక్ట్ ఆప్ కొలంబియా, ఫ్లోరిడా, జార్జియా టెర్ిటరీ ఆఫ్ గౌమ్, హవాయి, ఇదాహో, ఇల్లినాయిస్, ఇండియానా, లోవా, కన్సాస్, కెంచుకీ, లూసియానా, మసాచ్యుసెట్స్, మిచిగాన్, మిన్నెసోటా, మిస్సిసిప్పీ, మిసౌరి, మొంటానా, నెబ్రాస్కా, నెవడా, న్యూహాంప్‌షైర్, న్యూజెర్సీ, న్యూ మెక్సికో, న్యూయార్క్, నార్త్ కరోలినా, నార్త్ డకోటా, నార్తర్న్ మేరీనా ఐజ్‌లాండ్స్, ఓహియో ఓక్లహోమా, పెన్సిల్వేనియా, ప్యూర్టారికో, సౌత్ కరోలినా, టెన్నెస్సీ, ఉటాహ్, యూఎస్ వర్జిన్ ఐజ్‌లాండ్స్, వెర్మోంట్, వర్జీనియా, వాషింగ్టన్, వెస్ట్ వర్జీనియా, విస్కాన్సిన్ రాష్ట్రాలు కూడా ఈ దావాలో కలిశాయి.
More From GoodReturns

హార్ముజ్ జలసంధిపై ఇరాన్ కీలక ప్రకటన..శత్రుదేశాల నౌకలకు ప్రవేశం లేదని స్పష్టం చేసిన టెహ్రాన్..

అమెరికాతో చర్చలేమి జరగలేదు..ట్రంప్ వ్యాఖ్యలను ఖండించిన ఇరాన్.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందనే భయంతోనే..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?



Click it and Unblock the Notifications