న్యూఢిల్లీ: ఇన్ని నెలలు భారీగా పెరుగుతూ వచ్చిన పెట్రోల్, డీజిల్ రేట్లు ఒక్కసారిగా తగ్గాయి. దీపావళి పండగను పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ఇంధనంపై ఎక్సైజ్ డ్యూటీని తగ్గించింది. పెట్రోల్‌పై అయిదు రూపాయలు, డీజిల్‌పై 10 రూపాయల మేర ఈ సుంకాన్ని తగ్గించింది. ఫలితంగా- వాటి రేట్లు దేశవ్యాప్తంగా 100 రూపాయలకు పడిపోయింది. వాహనదారులకు కొంత మేర ఊరట కలిగించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పలు రాష్ట్రాలు అనుసరించాయి.

పెట్రో రేట్లు కేంద్రం నియంత్రణలో
తాము కూడా ఇంధన అమ్మకాలపై విధించిన వ్యాట్, సేల్స్ ట్యాక్స్‌ను కొంతమేర తగ్గించాయి. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్, అమ్మకం పన్నును తగ్గించలేదు. వాటిని తగ్గించాలా? వద్దా? అనేది రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయం మీదే ఆధారపడి ఉంటుంది. 22 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు మాత్రమే పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై వ్యాట్‌ను తగ్గించాయి. ఇందులో మెజారిటీ రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది.

వ్యాట్ తగ్గించిన రాష్ట్రాలివే..
ఇంకొన్ని రాష్ట్రాలు వ్యాట్ తగ్గింపు జోలికి వెళ్లలేదు. కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీని తగ్గించిన మేరకు ఆయా రాష్ట్రాల్లోనూ ఇంధన ధరలు తగ్గాయి. దీనికి కొనసాగింపుగా కొన్ని రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలు తాము విధించిన వ్యాట్‌ను తగ్గించట్లేదు. కర్ణాటక, పుదుచ్చేరి, మిజోరం, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, నాగాలాండ్, త్రిపుర, అస్సాం, సిక్కిం, బిహార్, మధ్యప్రదేశ్, గోవా, గుజరాత్, దాద్రా నగర్ అండ్ హవేలి, దమన్ అండ్ డయ్యు, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, ఉత్తర ప్రదేశ్, లఢక్‌లల్లో వ్యాట్, అమ్మకం పన్ను కూడా తగ్గింది.

ఎక్సైజ్ డ్యూటీకి అదనంగా వ్యాట్ తగ్గింపు..
కేంద్ర ప్రభుత్వం తగ్గించిన ఎక్సైజ్ డ్యూటీకి ఇది అదనం. ఫలితంగా ఆయా రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ మంట మరింత చల్లారింది. బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో వ్యాట్, అమ్మకం పన్ను తగ్గలేదు. రాజస్థాన్, పంజాబ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, జార్ఖండ్, తమిళనాడు, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అండమాన్ అండ్ నికోబార్ ప్రభుత్వాలు వ్యాట్, సేల్స్ ట్యాక్స్‌ను తగ్గించడానికి సుముఖత వ్యక్తం చేయట్లేదు. ఒడిశా మాత్రం పాక్షికంగా వ్యాట్‌ను తగ్గించింది.

కేంద్రం పెంచిన ప్రతీసారీ.. వ్యాట్ భారం మోపట్లేదంటూ..
పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై మూడు రూపాయలు చొప్పున విలువ ఆధారిత పన్నును కుదించింది. తమిళనాడు ప్రభుత్వం ఇదివరకే ఆ పని చేసిన విషయం తెలిసిందే. పెట్రోల్, డీజిల్ రేట్ల పెంపుదల, తగ్గింపు అనేది పూర్తి కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంది. మొన్నటి దాకా విపరీతంగా ఇంధన ధరలను పెంచుకుంటూ పోయింది కేంద్ర ప్రభుత్వం. దానికి అనుగుణంగా తాము వ్యాట్, సేల్స్ ట్యాక్స్‌ను పెంచలేదనేది ఆయా రాష్ట్రాలు చెబుతున్నాయి.

ఎల్పీజీ వంటగ్యాస్ మాటేంటీ?
కేంద్ర ప్రభుత్వం ఇంధన ధరలను పెంచినప్పుడు ఎవ్వరూ నోరు విప్పలేదని, ఇప్పుడు తగ్గిస్తే.. తాము కూడా దాన్నే అనుసరించాలని డిమాండ్ చేయడం సరికాదని స్పష్టం చేస్తోన్నాయి. ఎల్పీజీ వంటగ్యాస్ రేట్ల సంగతేమిటనీ ప్రశ్నిస్తున్నాయి. ప్రజలపై నిజంగా కేంద్ర ప్రభుత్వానికి ప్రేమ ఉంటే ఎల్పీజీ రేట్లను కూడా కుదించాలని సూచిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం పెట్రో రేట్లను భారీగా పెంచి.. తగ్గించిందని, ఆ పని తాము చేయట్లేదని గుర్తు చేస్తున్నాయి. దీనిమీద బీజేపీ, దాని మిత్రపక్షాలు నిరసన ప్రదర్శనలను నిర్వహిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వ్యాట్‌ను తగ్గించాలని పట్టుబడుతున్నాయి.
More From GoodReturns

Petrol prices: పెట్రోల్, డీజిల్‌పై రూ. 10 పన్ను తగ్గింపు.. అయినా సామాన్యులకు ఊరట లేదు! ఏందుకంటే..

Petrol prices: పెట్రోల్ ధరలు తగ్గాయా? పెరిగాయా? నేటి మార్చి 29 తాజా రేట్లు ఇవే!

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications