పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు, తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే?
పెట్రోల్, డీజిల్ ధరలు శుక్రవారం (డిసెంబర్ 4) పెరిగాయి. నేడు లీడర్ పెట్రోల్ ధర 17 పైసల నుండి 20 పైసలు పెరగగా, డీజిల్ ధర 21 పైసల నుండి 24 పైసలు పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ లీటర్ పైన 20 పైసలు, డీజిల్ 23 పైసలు పెరిగింది. ఢిల్లీలో నిన్న పెట్రోల్ రూ.82.66గా ఉండగా, నేడు రూ.82.86కు పెరిగింది. ఢిల్లీలో నిన్న లీటర్ డీజిల్ ధర రూ.72.84 కాగా నేడు రూ.73.07కు పెరిగింది.

వివిధ నగరాల్లో ధరలు
నేడు ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.82.86, లీటర్ డీజిల్ రూ.73.07గా ఉంది. ముంబైలో పెట్రోల్ 19 పైసలు పెరిగి రూ.89.33 నుండి రూ.89.52కు పెరిగింది. కోల్‌కతాలో రూ.84.18 నుండి రూ.84.37కు పెరిగింది. చెన్నైలో పెట్రోల్ రూ.85.59 నుండి రూ.85.76కు పెరిగింది.
డీజిల్ ధర ఢిల్లీలో లీటర్ రూ.72.84 నుండి రూ.73.07 పెరిగింది. ముంబైలో రూ.79.42 నుండి రూ.79.66కు పెరిగింది. కోల్‌కతాలో రూ.76.41 నుండిరూ.76.64కు పెరిగింది. చెన్నైలో రూ.78.24 నుండి రూ.78.45కు పెరిగింది.
తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.86.18, డీజిల్ రూ.79.73, అమరావతిలో పెట్రోల్ రూ.89.00, డీజిల్ రూ.82, విశాఖలో పెట్రోల్ రూ.87.77, డీజిల్ రూ.80.89గా ఉంది.

ఎస్సెమ్మెస్ ద్వారా సమాచారం
పెట్రోల్, డీజిల్ ధరలను మీరు ఎస్సెమ్మెస్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. ఇండియన్ ఆయిల్ ఐవోసీ మొబైల్ ద్వారా మీకు ధరలను అందిస్తుంది. ఆర్ఎస్‌పీ అని టైప్ చేసి, సిటీ కోడ్ ఇచ్చి 9224992249కు మొబైల్ నెంబర్ పంపించాలి. వెంటనే మీ మొబైల్ నెంబర్‌కు పెట్రోల్, డీజిల్ రేట్లు వస్తాయి. ప్రతి నగరానికి ఓ కోడ్ ఉంటుంది. IOC వెబ్ సైట్‌లో దీనిని చూడవచ్చు.

6 గంటలకు పెట్రోల్ ధరల సవరణ
పెట్రోల్, డీజిల్ ధరలు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు మారుతాయి. ఎక్సైజ్ డ్యూటీ, డీలర్ కమిషన్ సహా వివిధ ఛార్జీల కారణంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువగా ఉంటాయి. వ్యాక్సీన్ సానుకూల ప్రకటనల నేపథ్యంలో అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పెరుగుతున్నాయి. దాదాపు రెండు నెలల విరామం అనంతరం నవంబర్ 20వ తేదీ నుండి కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను సవరిస్తున్నారు. నవంబర్ 22వ తేదీకి ముందు సెప్టెంబర్ 22వ తేదీన పెట్రోల్ ధరలు పెరిగాయి. ఆ తర్వాత రెండు నెలల పాటు మార్పులేదు.


Click it and Unblock the Notifications