ముంబై: అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. ట్రేడింగ్- బ్యారెల్ ఒక్కింటికి 75 నుంచి 80 డాలర్ల వరకు ఉంటోంది. తాజాగా- బ్రెంట్ ఫ్యూచర్స్‌లో బ్యారెల్ ఒక్కింటికి 77.64 డాలర్లు పలికింది. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్‌లో బ్యారెల్ రేటు 73.38 డాలర్లు. ఆదివారం నాటితో పోల్చుకుంటే ఈ రెండు చోట్లా క్రూడ్ ధరలో స్వల్పంగా పెరుగుదల కనిపించింది.
క్రూడాయిల్ బ్యారెల్ ధర 75-80 డాలర్ల మధ్యే కొనసాగుతున్నప్పటికీ.. వాహనదారులపై మాత్రం పెట్రోల్, డీజిల్ మోత తప్పట్లేదు. క్రూడ్ రేట్ కదలికలకు అనుగుణంగా వాటి రేట్లను సవరించే అవకాశాలు లేకపోలేదు. ఆయిల్ కంపెనీలు కొద్దిసేపటి కిందటే పెట్రోల్, డీజిల్ రేట్లను జారీ చేశాయి. ఢిల్లీలో పెట్రోల్ లీటర్ ఒక్కింటికి రూ.96.72 పైసలు, డీజిల్ రూ.89.62 పైసలు పలుకుతోంది.

ముంబైలో పెట్రోల్ లీటర్ ఒక్కింటికి రూ.106.35 పైసలుగా నమోదైంది. ఇక్కడ డీజిల్ ధర 94.28 పైసలు. కోల్‌కతలో పెట్రోల్ రూ.106.03 పైసలు, డీజిల్ రూ.92.76 పైసలుగా ఉంటోంది. చెన్నైలో పెట్రోల్ రేటు రూ.102.63 పైసలు, డీజిల్ 94.24 పైసలుగా నమోదైంది. బెంగళూరులో పెట్రోల్ రూ.101.94 పైసలు, డీజిల్ రూ.87.89 పైసలుగా ఉంటోంది.
లక్నోలో పెట్రోల్ రూ.96.57 పైసలు, డీజిల్ 89.76 పైసలు, విశాఖపట్నంలో పెట్రోల్ రూ.110.48 పైసలు, డీజిల్ 98.38 పైసలుగా రికార్డయింది. అహ్మదాబాద్‌లో పెట్రోల్ రూ.96.63 పైసలు, డీజిల్ రూ.92.38 పైసలుగా రికార్డయింది. హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.109.66 పైసలు, డీజిల్ రూ.97.82 పైసలు, పాట్నాలో పెట్రోల్ 107.24 పైసలు, డీజిల్ రూ.94.04 పైసలు పలుకుతోంది.
తిరువనంతపురంలో పెట్రోల్ 107.87 పైసలు, డీజిల్ రూ.96.67 పైసలుగా నమోదైంది. నొయిడాలో పెట్రోల్ రూ.96.79 పైసలు, డీజిల్ రూ.89.96 పైసలు, గుర్‌గావ్‌లో పెట్రోల్ రూ.97.18 పైసలు, డీజిల్-90.05 పైసలు, చండీగఢ్‌లో పెట్రోల్-96.20 పైసలు, డీజిల్ 84.26 పైసలు. కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీని తగ్గించిన తరువాత మూడు రాష్ట్రాలు మాత్రమే తాము వసూలు చేస్తోన్న విలువ ఆధారిత పన్నును తగ్గించాయి.
More From GoodReturns

పెట్రోల్,డీజిల్ ధరల షాక్.. ఒక్కసారిగా రూ.55 పెంపు.. ఆర్థిక సంక్షోభంలో పాకిస్తాన్

ముంచుకొస్తున్న 1970 చమురు సంక్షోభం.. ధరల పెరుగుదలతో పలు దేశాలు విలవిల..

ఇరాన్ యుద్దం ముగుస్తుందనే అంచనాలు.. తగ్గిన ముడి చమురు ధరలు.. ట్రంప్ ఏమన్నారంటే..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్‌లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్‌లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?



Click it and Unblock the Notifications