నేటి కొత్త పెట్రోల్, డీజిల్ రేట్లివీ
ముంబై: అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధర భారీగా తగ్గింది. బ్యారెల్ ఒక్కింటికి గరిష్ఠంగా 75 డాలర్లు పలుకుతోంది. కొద్దిరోజులుగా 70 నుంచి 75 డాలర్ల మధ్యే వాటి ట్రేడింగ్ కొనసాగుతూ వస్తోంది. బ్రెంట్ ఫ్యూచర్స్‌లో బ్యారెల్ ఒక్కింటికి 75.07 డాలర్లు పలికింది. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్లో ఈ రేట్ ఇంకా తక్కువగా నమోదైంది. బ్యారెల్ రేటు 71.19 డాలర్లు. ఆదివారం నాటితో పోల్చుకుంటే ఈ రెండు చోట్లా క్రూడ్ ఫ్లాట్‌గా ట్రేడ్ అయ్యాయి.
క్రూడాయిల్ బ్యారెల్ ధర 70-75 డాలర్ల మధ్యే కొనసాగుతున్నప్పటికీ.. వాహనదారులపై మాత్రం పెట్రోల్, డీజిల్ మోత తప్పట్లేదు. ఉపశమనం కలిగించే దిశగా కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. ఆయిల్ కంపెనీలు కొద్దిసేపటి కిందటే పెట్రోల్, డీజిల్ రేట్లను జారీ చేశాయి. ఢిల్లీలో పెట్రోల్ లీటర్ ఒక్కింటికి రూ.96.72 పైసలు, డీజిల్ రూ.89.62 పైసలు పలుకుతోంది.
ముంబైలో పెట్రోల్ లీటర్ ఒక్కింటికి రూ.106.35 పైసలుగా నమోదైంది. ఇక్కడ డీజిల్ ధర 94.28 పైసలు. కోల్‌కతలో పెట్రోల్ రూ.106.03 పైసలు, డీజిల్ రూ.92.76 పైసలుగా ఉంటోంది. చెన్నైలో పెట్రోల్ రేటు రూ.102.63 పైసలు, డీజిల్ 94.24 పైసలుగా నమోదైంది. బెంగళూరులో పెట్రోల్ రూ.101.94 పైసలు, డీజిల్ రూ.87.89 పైసలుగా ఉంటోంది.
లక్నోలో పెట్రోల్ రూ.96.57 పైసలు, డీజిల్ 89.76 పైసలు, విశాఖపట్నంలో పెట్రోల్ రూ.110.48 పైసలు, డీజిల్ 98.38 పైసలుగా రికార్డయింది. అహ్మదాబాద్‌లో పెట్రోల్ రూ.96.63 పైసలు, డీజిల్ రూ.92.38 పైసలుగా రికార్డయింది. హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.109.66 పైసలు, డీజిల్ రూ.97.82 పైసలు, పాట్నాలో పెట్రోల్ 107.24 పైసలు, డీజిల్ రూ.94.04 పైసలు పలుకుతోంది.
తిరువనంతపురంలో పెట్రోల్ 107.87 పైసలు, డీజిల్ రూ.96.67 పైసలుగా నమోదైంది. నొయిడాలో పెట్రోల్ రూ.96.79 పైసలు, డీజిల్ రూ.89.96 పైసలు, గుర్గావ్లో పెట్రోల్ రూ.97.18 పైసలు, డీజిల్-90.05 పైసలు, చండీగఢ్‌లో పెట్రోల్-96.20 పైసలు, డీజిల్ 84.26 పైసలు. కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీని తగ్గించిన తరువాత మూడు రాష్ట్రాలు మాత్రమే తాము వసూలు చేస్తోన్న విలువ ఆధారిత పన్నును తగ్గించాయి.