ముంబై: అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధర స్థిరంగా కొనసాగుతోంది. బ్యారెల్ ఒక్కింటికి 70- 75 డాలర్లకు అటు ఇటుగా ఉంటోంది. బ్రెంట్ ఫ్యూచర్స్ ట్రేడింగ్‌లో బ్యారెల్ ఒక్కింటికి 76.26 డాలర్లు పలికింది. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్‌లో ఈ రేట్ ఇంకా తక్కువగా నమోదైంది. 71.44 డాలర్ల వద్ద ట్రేడింగ్ రికార్డయింది. శుక్రవారం నాటితో పోల్చుకుంటే ఈ రెండు చోట్లా క్రూడ్ ధరలో స్వల్పంగా పెరుగుదల కనిపించింది.
ఈ పరిస్థితుల్లో ఆయిల్ కంపెనీలు కొద్దిసేపటి కిందటే పెట్రోల్, డీజిల్ రేట్లను జారీ చేశాయి. 75 డాలర్లకు క్రూడాయిల్ రేట్ ఉన్నప్పటికీ ఇంధన ధరలను తగ్గించట్లేదు. పెట్రోల్ రేట్‌ను పెంచే ప్రతిపాదనలు కేంద్రం పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలో పెట్రోల్ లీటర్ ఒక్కింటికి రూ.96.72 పైసలు, డీజిల్ రూ.89.62 పైసలు పలుకుతోంది. ముంబైలో పెట్రోల్ లీటర్ ఒక్కింటికి రూ.106.35 పైసలుగా నమోదైంది. ఇక్కడ డీజిల్ ధర 94.28 పైసలు.

కోల్‌కతలో పెట్రోల్ రూ.106.03 పైసలు, డీజిల్ రూ.92.76 పైసలుగా ఉంటోంది. చెన్నైలో పెట్రోల్ రేటు రూ.102.63 పైసలు, డీజిల్ 94.24 పైసలుగా నమోదైంది. బెంగళూరులో పెట్రోల్ రూ.101.94 పైసలు, డీజిల్ రూ.87.89 పైసలుగా ఉంటోంది. లక్నోలో పెట్రోల్ రూ.96.57 పైసలు, డీజిల్ 89.76 పైసలు, విశాఖపట్నంలో పెట్రోల్ రూ.110.48 పైసలు, డీజిల్ 98.38 పైసలుగా రికార్డయింది. అహ్మదాబాద్‌లో పెట్రోల్ రూ.96.63 పైసలు, డీజిల్ రూ.92.38 పైసలుగా రికార్డయింది.
హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.109.66 పైసలు, డీజిల్ రూ.97.82 పైసలు, పాట్నాలో పెట్రోల్ 107.24 పైసలు, డీజిల్ రూ.94.04 పైసలు పలుకుతోంది. తిరువనంతపురంలో పెట్రోల్ 107.87 పైసలు, డీజిల్ రూ.96.67 పైసలుగా నమోదైంది. నొయిడాలో పెట్రోల్ రూ.96.79 పైసలు, డీజిల్ రూ.89.96 పైసలు, గుర్‌గావ్‌లో పెట్రోల్ రూ.97.18 పైసలు, డీజిల్-90.05 పైసలు, చండీగఢ్‌లో పెట్రోల్-98.20 పైసలు, డీజిల్ 84.26 పైసలు.
తాజాగా పంజాబ్ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై వ్యాట్‌ను పెంచింది. ఫలితంగా అక్కడ ఈ రెండింటి ధరలు భారీగా పెరిగాయి. చండీగఢ్‌లో పెట్రోల్ కంటే డీజిల్ రేటే అధికంగా ఉంటోంది. డీజిల్ ధర లీటర్ ఒక్కింటికి రూ.105.20 పైసలు పలుకుతోంది. గతంలో కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీని తగ్గించిన తరువాత రాజస్థాన్, కేరళ, మహారాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్‌ను కుదించాయి.
ఇప్పుడు తాజాగా పంజాబ్ ప్రభుత్వం వాటిని సవరించింది. ఇప్పుడు అదే బాటలో ఇతర రాష్ట్రాలు కూడా నడుస్తాయనే ప్రచారం జరుగుతోంది. పెట్రోల్, డీజిల్ రేట్లు జీఎస్టీ పరిధిలో లేవు. ఫలితంగా- రాష్ట్ర ప్రభుత్వాలే వాటిని నియంత్రించుకోవచ్చు. రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకోవడంలో భాగంగా పంజాబ్ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై వ్యాట్‌ను పెంచింది. దీనివల్ల సంవత్సరానికి 600 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని అంచనా వేసింది.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: బెంగళూరు వాహనదారులకు అలర్ట్! ఆ రూట్లో ఫ్లైఓవర్ 84 గంటలు బంద్!



Click it and Unblock the Notifications