ముంబై: అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధర స్థిరంగా కొనసాగుతోంది. బ్యారెల్ ఒక్కింటికి 70 డాలర్లకు అటు ఇటుగా ఉంటోంది. బ్రెంట్ ఫ్యూచర్స్ ట్రేడింగ్‌లో బ్యారెల్ ఒక్కింటికి 73.06 డాలర్లు పలికింది. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్‌లో ఈ రేట్ ఇంకా తక్కువగా నమోదైంది. 68.15 డాలర్ల వద్ద ట్రేడింగ్ రికార్డయింది. బుధవారం నాటితో పోల్చుకుంటే ఈ రెండు చోట్లా క్రూడ్ ధరలో స్వల్పంగా తగ్గుదల కనిపించింది.
ఈ పరిస్థితుల్లో ఆయిల్ కంపెనీలు కొద్దిసేపటి కిందటే పెట్రోల్, డీజిల్ రేట్లను జారీ చేశాయి. 70 డాలర్లకు క్రూడాయిల్ రేట్ పడిపోయినప్పటికీ ఇంధన ధరలను తగ్గించట్లేదు. ఢిల్లీలో పెట్రోల్ లీటర్ ఒక్కింటికి రూ.96.72 పైసలు, డీజిల్ రూ.89.62 పైసలు పలుకుతోంది. ముంబైలో పెట్రోల్ లీటర్ ఒక్కింటికి రూ.106.35 పైసలుగా నమోదైంది. ఇక్కడ డీజిల్ ధర 94.28 పైసలు. కోల్‌కతలో పెట్రోల్ రూ.106.03 పైసలు, డీజిల్ రూ.92.76 పైసలుగా ఉంటోంది.

చెన్నైలో పెట్రోల్ రేటు రూ.102.63 పైసలు, డీజిల్ 94.24 పైసలుగా నమోదైంది. బెంగళూరులో పెట్రోల్ రూ.101.94 పైసలు, డీజిల్ రూ.87.89 పైసలుగా ఉంటోంది. లక్నోలో పెట్రోల్ రూ.96.57 పైసలు, డీజిల్ 89.76 పైసలు, విశాఖపట్నంలో పెట్రోల్ రూ.110.48 పైసలు, డీజిల్ 98.38 పైసలుగా రికార్డయింది. అహ్మదాబాద్‌లో పెట్రోల్ రూ.96.63 పైసలు, డీజిల్ రూ.92.38 పైసలుగా రికార్డయింది.
హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.109.66 పైసలు, డీజిల్ రూ.97.82 పైసలు, పాట్నాలో పెట్రోల్ 107.24 పైసలు, డీజిల్ రూ.94.04 పైసలు పలుకుతోంది. తిరువనంతపురంలో పెట్రోల్ 107.87 పైసలు, డీజిల్ రూ.96.67 పైసలుగా నమోదైంది. నొయిడాలో పెట్రోల్ రూ.96.79 పైసలు, డీజిల్ రూ.89.96 పైసలు, గుర్‌గావ్‌లో పెట్రోల్ రూ.97.18 పైసలు, డీజిల్-90.05 పైసలు, చండీగఢ్‌లో పెట్రోల్-98.20 పైసలు, డీజిల్ 84.26 పైసలు.
తాజాగా పంజాబ్ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై వ్యాట్‌ను పెంచింది. ఫలితంగా అక్కడ ఈ రెండింటి ధరలు భారీగా పెరిగాయి. చండీగఢ్‌లో పెట్రోల్ కంటే డీజిల్ రేటే అధికంగా ఉంటోంది. డీజిల్ ధర లీటర్ ఒక్కింటికి రూ.105.20 పైసలు పలుకుతోంది. గతంలో కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీని తగ్గించిన తరువాత రాజస్థాన్, కేరళ, మహారాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్‌ను కుదించాయి.
ఇప్పుడు తాజాగా పంజాబ్ ప్రభుత్వం వాటిని సవరించింది. ఇప్పుడు అదే బాటలో ఇతర రాష్ట్రాలు కూడా నడుస్తాయనే ప్రచారం జరుగుతోంది. పెట్రోల్, డీజిల్ రేట్లు జీఎస్టీ పరిధిలో లేవు. ఫలితంగా- రాష్ట్ర ప్రభుత్వాలే వాటిని నియంత్రించుకోవచ్చు. రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకోవడంలో భాగంగా పంజాబ్ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై వ్యాట్‌ను పెంచింది. దీనివల్ల సంవత్సరానికి 600 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని అంచనా వేసింది.


Click it and Unblock the Notifications