ముంబై: అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధర ప్రస్తుతానికి భారీగా తగ్గింది. బ్రెంట్ ఫ్యూచర్స్ ట్రేడింగ్‌లో బ్యారెల్ ఒక్కింటికి 71.83 డాలర్లు పలికింది. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్‌లో ఈ రేట్ ఇంకా తక్కువగా నమోదైంది. 67.28 డాలర్ల వద్ద ట్రేడింగ్ రికార్డయింది. సోమవారం నాటితో పోల్చుకుంటే ఈ రెండు చోట్లా క్రూడ్ ధరలో తగ్గుదల కనిపించింది.
ఈ పరిస్థితుల్లో ఆయిల్ కంపెనీలు కొద్దిసేపటి కిందటే పెట్రోల్, డీజిల్ రేట్లను జారీ చేశాయి. 70 డాలర్లకు క్రూడాయిల్ రేట్ పడిపోయినప్పటికీ ఇంధన ధరలను తగ్గించట్లేదు. ఢిల్లీలో పెట్రోల్ లీటర్ ఒక్కింటికి రూ.96.72 పైసలు, డీజిల్ రూ.89.62 పైసలు పలుకుతోంది. ముంబైలో పెట్రోల్ లీటర్ ఒక్కింటికి రూ.106.35 పైసలుగా నమోదైంది. ఇక్కడ డీజిల్ ధర 94.28 పైసలు. కోల్‌కతలో పెట్రోల్ రూ.106.03 పైసలు, డీజిల్ రూ.92.76 పైసలుగా ఉంటోంది.

చెన్నైలో పెట్రోల్ రేటు రూ.102.63 పైసలు, డీజిల్ 94.24 పైసలుగా నమోదైంది. బెంగళూరులో పెట్రోల్ రూ.101.94 పైసలు, డీజిల్ రూ.87.89 పైసలుగా ఉంటోంది. లక్నోలో పెట్రోల్ రూ.96.57 పైసలు, డీజిల్ 89.76 పైసలు, విశాఖపట్నంలో పెట్రోల్ రూ.110.48 పైసలు, డీజిల్ 98.38 పైసలుగా రికార్డయింది. అహ్మదాబాద్‌లో పెట్రోల్ రూ.96.63 పైసలు, డీజిల్ రూ.92.38 పైసలుగా రికార్డయింది.
హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.109.66 పైసలు, డీజిల్ రూ.97.82 పైసలు, పాట్నాలో పెట్రోల్ 107.24 పైసలు, డీజిల్ రూ.94.04 పైసలు పలుకుతోంది. తిరువనంతపురంలో పెట్రోల్ 107.87 పైసలు, డీజిల్ రూ.96.67 పైసలుగా నమోదైంది. నొయిడాలో పెట్రోల్ రూ.96.79 పైసలు, డీజిల్ రూ.89.96 పైసలు, గుర్‌గావ్‌లో పెట్రోల్ రూ.97.18 పైసలు, డీజిల్-90.05 పైసలు, చండీగఢ్‌లో పెట్రోల్-98.20 పైసలు, డీజిల్ 84.26 పైసలు.
తాజాగా పంజాబ్ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై వ్యాట్‌ను పెంచింది. ఫలితంగా అక్కడ ఈ రెండింటి ధరలు భారీగా పెరిగాయి. చండీగఢ్‌లో పెట్రోల్ కంటే డీజిల్ రేటే అధికంగా ఉంటోంది. డీజిల్ ధర లీటర్ ఒక్కింటికి రూ.105.20 పైసలు పలుకుతోంది. గతంలో కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీని తగ్గించిన తరువాత రాజస్థాన్, కేరళ, మహారాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్‌ను కుదించాయి.
ఇప్పుడు తాజాగా పంజాబ్ ప్రభుత్వం వాటిని సవరించింది. ఇప్పుడు అదే బాటలో ఇతర రాష్ట్రాలు కూడా నడుస్తాయనే ప్రచారం జరుగుతోంది. పెట్రోల్, డీజిల్ రేట్లు జీఎస్టీ పరిధిలో లేవు. ఫలితంగా- రాష్ట్ర ప్రభుత్వాలే వాటిని నియంత్రించుకోవచ్చు. రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకోవడంలో భాగంగా పంజాబ్ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై వ్యాట్‌ను పెంచింది. దీనివల్ల సంవత్సరానికి 600 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని అంచనా వేసింది.
More From GoodReturns

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్‌లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?



Click it and Unblock the Notifications