న్యూఢిల్లీ: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. ఇవ్వాళ కూడా పెట్రోల్, డీజిల్‌పై లీటర్‌పై 35 పైసలు పెరిగింది. లీటర్‌కు 35 పైసల మేర పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం వరుసగా ఇది నాలుగోసారి. మూడురోజులకు ఒకసారి లీటర్ ఒక్కటింకి రూపాయికి పైగా భారం పడుతోంది. బుధవారం నుంచి ఇదే తంతు కొనసాగుతోంది. ఇంధన ధరలను పెంచే విషయంలో చమురు సంస్థలు ఏ మాత్రం వెనుకాడట్లేదు. వాహనదారులపై అదనపు భారాన్ని మోపుతూనే ఉన్నాయి. కరోనా వైరస్ సంక్షోభ పరిస్థితుల్లో ఆర్థికంగా ఇబ్బందుల పాలైన కోట్లాది కుటుంబాలపై పెట్రోల్, డీజిల్ ధరల పెంపుదల రూపంలో వీపు విమానం మోత మోగుతోంది.

లీటర్‌పై 35 పైసలు.. నాలుగోస్సారి
భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ తాజాగా చేసిన సవరణల ప్రకారం- పెట్రోల్, డీజిల్‌పై 35 పైసల మేర పెంపుదల కనిపించింది. లీటర్ ఒక్కింటికి 35 పైసల మేర పెంచడాన్ని బెంచ్‌మార్క్‌గా పెట్టుకున్నట్టు కనిపిస్తోన్నాయి చమురు కంపెనీలు. తాజాగా పెరిగిన ధరలతో దేశంలోని అనేక నగరాల్లో లీటర్ పెట్రోల్ 115 రూపాయలను దాటింది. డీజిల్ వంద రూపాయల మార్క్‌ను దాటేసింది. కొన్ని నగరాల్లో డీజిల్ 105 రూపాయలను దాటేసింది. ఈ రకమైన పెంపు అనేది చరిత్రలోనే ఎప్పుడూ చోటు చేసుకోలేదు.

మూడు రూపాయలు తగ్గించినా.. ఫలితం లేనట్టే
తాజా పెంపుతో దేశ రాజధానిలో పెట్రోల్ లీటర్ ఒక్కింటికి రూ.107.24 పైసలకు చేరింది. డీజిల్ 95.98 పైసలుగా నమోదైంది.దేశ ఆర్థిక రాజధాని ముంబైలో పెట్రోల్ రూ.113.08 పైసలు పలుకుతోంది. అక్కడ డీజిల్ రూ.103.97 పైసలకు చేరింది. కోల్‌కతలో పెట్రోల్ ధర రూ.107.74 పైసలుగా నమోదైంది. డీజిల్ ధర రూ.99.05 పైసలుగా రికార్డయింది. చెన్నైలో పెట్రోల్ రూ.104.19 పైసలు, డీజిల్ ధర రూ.100.22 పైసలుగా ఉంటోంది. పెట్రోల్ అమ్మకాలపై తమిళనాడు ప్రభుత్వం మూడు రూపాయల మేర పన్నును తగ్గించినప్పటికీ ఉపయోగం లేకుండా పోయినట్టయింది.

హైదరాబాద్‌లో డీజిల్ భగ్గు..
కాగా- బెంగళూరులో పెట్రోల్ రేటు రూ.110.94, డీజిల్ రూ.101.82 పైసలు, హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.111.51 పైసలు, డీజిల్ రూ.104.66 పైసలకు చేరింది. విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ.113.53 పైసలు, డీజిల్ ధర రూ.106.23 పైసలకు చేరింది. పాట్నాలో పెట్రోల్ రూ.110.80 పైసలు, డీజిల్ రూ.102.53 పైసలు, జైపూర్‌లో పెట్రోల్ రూ.114.43 పైసలు, డీజిల్ రూ.105.68 పైసలుగా రికార్డయింది. లక్నోలో పెట్రోల్ రూ.104.16, డీజిల్- 96.39, చండీగఢ్‌లో పెట్రోల్ రూ.103.17, డీజిల్ రూ.95.64 పైసలుగా నమోదైంది.

బాదడమే తక్షణ కర్తవ్యం..
రోజువారీ పెరుగుదలలో అడపాదడపా కొంత విరామం లభిస్తోందే తప్ప.. రేట్లు మాత్రం తగ్గట్లేదు. రెండు రోజులు బ్రేక్ ఇస్తే.. వారం రోజుల పాటు వాటి ధరలను పెంచే పరిస్థితి దేశంలో నెలకొంది. ఈ రోజుతో ఇంధన ధరలను పెంచడాన్ని చమురు సంస్థల ఆపివేస్తాయని ఏ రోజుకు ఆ రోజు అనుకోవడం ఓ అత్యాశగానే మిగిలిపోయింది. ప్రతిరోజు వాహనదారులను బాదడమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు కనిపిస్తోన్నాయి చమురు సంస్థలు. ఇదివరకట్లా మళ్లీ వరుసగా వాటి పెట్రోల్, డీజిల్ ధరలను చమురు సంస్థలు పెంచబోవనే గ్యారంటీ ఉండట్లేదు.

మూడు రోజుల్లో రూపాయికిపైగా..
రేట్లు ఎక్కడికి వెళ్లి ఆగుతాయనేదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇదివరకటి కంటే కూడా ఇప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా పెంచడంతో రేట్లు మరింత వేగంగా పైపైకి దూసుకెళ్తున్నాయి. పెట్రోల్, డీజిల్ లీటర్ ఒక్కింటికి 35 పైసల మేర చొప్పున పెంచుతూ వస్తోండటం వల్ల మూడు రోజుల్లోనే ఒక రూపాయిని దాటస్తున్నాయి వాటి ధరలు. ఇలా ఎంత కాలం కొనసాగుతుందో తెలియదు. రేట్లు తగ్గే అవకాశం ఏ మాత్రం కూడా కనిపించట్లేదు.

ధరలు జూమ్..
ఈ మధ్యకాలంలో ప్రతిరోజూ ధరలు పెరుగుతున్నాయి. ఒకట్రెండు రోజుల విరామం లభిస్తోందే తప్ప.. పెరుగుదల అక్కడితో ఆగట్లేదు. ఆ విరామం ప్రకటించిన రోజుల్లో నెలకొన్న లోటును కూడా భర్తీ చేసుకునేలా పెట్రోల్, డీజిల్ రేట్లను భగ్గు మనిపిస్తున్నాయి చమురు సంస్థలు, ఈ ఏడాది మే 4వ తేదీన మొదలైన పెరుగుదల.. ఈ అయిదు నెలల పాటు వాహనదారులకు చుక్కలు చూపిస్తూ వచ్చింది. 45 నుంచి 50 రోజుల పాటు ప్రతిరోజూ వాటి రేట్లు పెరిగాయి. మధ్యలో కొంత విరామం తీసుకున్నాయి. మళ్లీ ఆకాశానికి ఎగబాకడం మొదలు పెట్టాయి. ఈ అయిదు నెలల్లో 50 రూపాయల వరకు పెరిగాయి వాటి రేట్లు.
More From GoodReturns

Petrol prices: పెట్రోల్, డీజిల్‌పై రూ. 10 పన్ను తగ్గింపు.. అయినా సామాన్యులకు ఊరట లేదు! ఏందుకంటే..

Petrol prices: పెట్రోల్ ధరలు తగ్గాయా? పెరిగాయా? నేటి మార్చి 29 తాజా రేట్లు ఇవే!

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications