క్రూడాయిల్ మార్కెట్‌లో వేగంగా మారుతున్న పరిణామాలు: దేశీయ పెట్రో అమ్మకాలపై ప్రభావం
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా క్రూడాయిల్ మార్కెట్‌లో పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. సౌదీ అరేబియా క్రూడాయిల్ రేట్లను అమాంతం పెంచింది. ఆ దేశ ఆయిల్ కంపెనీ ఆరమ్‌కో బ్యారెల్ ఒక్కింటికి 2.10 డాలర్ల మేర ధరను సవరించింది. భారత్ సహా ఆసియా దేశాలు యూరోప్ వాయవ్య ప్రాంతం, మిడ్‌టెర్రయిన్ రీజియన్లకు సరఫరా చేసే క్రూడ్ ధరలను సవరించింది. అమెరికాకు ఎగుమతి చేసే ఆయిల్ రేట్ల జోలికి మాత్రం వెళ్లలేదు. వాటిని యధాతథంగా కొనసాగిస్తోంది.
దీని ప్రభావం దేశీయ ఇంధన అమ్మకాలపై పడే అవకాశం లేకపోలేదు. వాటి ధరలను పెంచే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. ప్రస్తుతానికి పాత రేట్లే కొనసాగుతున్నాయి. ఇవి ఎంతో కాలం స్థిరంగా ఉండకపోవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తోన్నాయి. పెట్రోల్, డీజిల్ ధరల పెంపు అంశాన్ని పరిశీలించవచ్చని అభిప్రాయపడుతున్నాయి. ఈ పెంపు అనేది క్రూడాయిల్ మార్కెట్ రేట్ మీద ఆధారపడి ఉంటుంది.

ఇవ్వాళ్టి ప్రకారం.. దేశ రాజధానిలో పెట్రోల్ లీటర్ ఒక్కింటికి రూ.96.72 పైసలు, డీజిల్ రూ.89.62 పైసలు పలుకుతోంది. ముంబైలో పెట్రోల్ లీటర్ ఒక్కింటికి రూ111.35 పైసలు, డీజిల్ రూ.97.28 పైసలుగా నమోదైంది. కోల్‌కతలో పెట్రోల్ రూ.106.03 పైసలు, డీజిల్ రూ.92.76 పైసలుగా ఉంటోంది. చెన్నైలో పెట్రోల్ రేటు రూ.102.63 పైసలు, డీజిల్ 94.24 పైసలు. బెంగళూరులో పెట్రోల్ రూ.101.94 పైసలు, డీజిల్ రూ.87.89 పైసలుగా ఉంటోంది.
లక్నోలో పెట్రోల్ రూ.96.57 పైసలు, డీజిల్ 89.76 పైసలు, విశాఖపట్నంలో పెట్రోల్ రూ.110.48 పైసలు, డీజిల్ 98.38 పైసలుగా నమోదైంది. అహ్మదాబాద్‌లో పెట్రోల్ రూ.96.63 పైసలు, డీజిల్ 92,38 పైసలు, హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.109.66 పైసలు, డీజిల్ రూ.97.82 పైసలు, పాట్నాలో పెట్రోల్ 107.24 పైసలు, డీజిల్ రూ.94.04 పైసలు పలుకుతోంది. తిరువనంతపురంలో పెట్రోల్ 107.87 పైసలు, డీజిల్ రూ.96.67 పైసలుగా నమోదైంది.
కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీని తగ్గించిన తరువాత మూడు రాష్ట్రాలు మాత్రమే తాము వసూలు చేస్తోన్న విలువ ఆధారిత పన్నును తగ్గించాయి. రాజస్థాన్, కేరళ, మహారాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్‌ను కుదించాయి. బీజేపీ పాలిత రాష్ట్రాలు సైతం పెట్రోల్, డీజిల్ ధరలపై అమలు చేస్తోన్న వ్యాట్‌ను తగ్గించడానికి పెద్దగా ఆసక్తి చూపలేదు.. ఇదివరకట్లా. గతంలో కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీని కుదించిన అనంతరం మెజారిటీ రాష్ట్రాలు అదే దారిలో నడిచిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications