పెట్రోల్, డీజిల్ ధరలో..: క్రూడాయిల్ 121 డాలర్లను దాటిన వేళ..

న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలో అస్థిరత కనిపిస్తోంది. మొన్న శాంతించిన బ్రెంట్ క్రూడ్ ధర గ్రాఫ్ మళ్లీ ఉవ్వెత్తున ఎగిసింది. బ్యారెట్ ధర 121.08 డాలర్లకు చేరింది. యూఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్‌లో క్రూడాయిల్ రేటు దాదాపు ఇదే స్థాయిలో ఉంటోంది. 119 డాటర్లుగా నమోదైంది. సప్లయ్ ఇబ్బందులు పూర్తిగా తొలగిపోకపోవడం వల్ల క్రూడ్ ప్రైస్ తగ్గిందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తోన్నాయి.

దీని ప్రభావం దేశీయ ఇంధన అమ్మకాలపై పెద్దగా పడట్లేదు. పాత రేట్లే కొనసాగుతున్నాయి. కిందటి నెలలో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీని తగ్గించిన తరువాత వాహనదారులకు కొంత ఊరట కలిగింది. పెట్రోల్‌పై 8, డీజిల్‌పై 6 రూపాయల మేర తగ్గించిన అనంతరం వాటి ధరలు శాంతించాయి. పెట్రోల్‌ లీటర్ ఒక్కింటికి రూ.9.50 పైసలు, డీజిల్ లీటర్ ఒక్కింటికి 7 రూపాయల మేర తగ్గింది. అప్పటి నుంచి రేట్ల పెంపుదల చోటు చేసుకోలేదు.

Petrol and diesel prices on June 5, 2022 kept steady, check here for todays rates in your city

దేశ రాజధానిలో పెట్రోల్ లీటర్ ఒక్కింటికి రూ.96.72 పైసలు, డీజిల్ రూ.89.62 పైసలు పలుకుతోంది. ముంబైలో పెట్రోల్ లీటర్ ఒక్కింటికి రూ111.35 పైసలు, డీజిల్ రూ.97.28 పైసలుగా నమోదైంది. కోల్‌కతలో పెట్రోల్ రూ.106.03 పైసలు, డీజిల్ రూ.92.76 పైసలుగా ఉంటోంది. చెన్నైలో పెట్రోల్ రేటు రూ.102.63 పైసలు, డీజిల్ 94.24 పైసలు. బెంగళూరులో పెట్రోల్ రూ.101.94 పైసలు, డీజిల్ రూ.87.89 పైసలుగా ఉంటోంది.

లక్నోలో పెట్రోల్ రూ.96.57 పైసలు, డీజిల్ 89.76 పైసలు, విశాఖపట్నంలో పెట్రోల్ రూ.110.48 పైసలు, డీజిల్ 98.38 పైసలుగా నమోదైంది. అహ్మదాబాద్‌లో పెట్రోల్ రూ.96.63 పైసలు, డీజిల్ 92,38 పైసలు, హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.109.66 పైసలు, డీజిల్ రూ.97.82 పైసలు, పాట్నాలో పెట్రోల్ 107.24 పైసలు, డీజిల్ రూ.94.04 పైసలు పలుకుతోంది. తిరువనంతపురంలో పెట్రోల్ 107.87 పైసలు, డీజిల్ రూ.96.67 పైసలుగా నమోదైంది.

Petrol and diesel prices on June 5, 2022 kept steady, check here for todays rates in your city

పెట్రోల్, డీజిల్‌పై విధించిన వ్యాట్‌ను మరింత కుదించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు వెసలుబాటు ఉందంటూ ఇటీవలే స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓ నివేదికలో వెల్లడించిన విషయం తెలిసిందే. ఇంధనంపై వ్యాట్ అమలు చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు 49,229 కోట్ల రూపాయల రెవెన్యూ అందుతున్నట్లు అంచనా వేసింది. మహారాష్ట్ర, తెలంగాణతో పోల్చుకుంటే గుజరాత్‌లో వ్యాట్ తక్కువగా ఉందని వెల్లడించింది.

కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీని తగ్గించిన తరువాత మూడు రాష్ట్రాలు మాత్రమే తాము వసూలు చేస్తోన్న విలువ ఆధారిత పన్నును తగ్గించాయి. రాజస్థాన్, కేరళ, మహారాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్‌ను కుదించాయి. బీజేపీ పాలిత రాష్ట్రాలు సైతం పెట్రోల్, డీజిల్ ధరలపై అమలు చేస్తోన్న వ్యాట్‌ను తగ్గించడానికి పెద్దగా ఆసక్తి చూపలేదు.. ఇదివరకట్లా. గతంలో కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీని కుదించిన అనంతరం మెజారిటీ రాష్ట్రాలు అదే దారిలో నడిచిన విషయం తెలిసిందే.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+