క్రూడాయిల్ ధరల గ్రాఫ్..పైపైకే: 123 డాలర్లకు టచ్: పెట్రోల్, డీజిల్‌పై
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా మార్కెట్‌లో క్రూడాయిల్ ధరల గ్రాఫ్ పైపైకే వెళ్తోంది. 118 డాలర్ల వరకు తగ్గిన క్రూడ్ ధర.. మళ్లీ పెరిగింది. 122 డాలర్లకు చేరింది. బ్రెంట్ ఫ్యూచర్స్ ట్రేడింగ్‌లో 122.38 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. అటు వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్‌లోనూ దాదాపు ఇదే ప్రైస్ కనిపిస్తోంది. అక్కడ ఒక బ్యారెల్ క్రూడాయిల్ రేటు 120.96 డాలర్లు పలుకుతోంది.
దీని ప్రభావం దేశీయ ఇంధన అమ్మకాలపై ప్రస్తుతానికి పడట్లేదు. పాత రేట్లే కొనసాగుతున్నాయి. ఇవ్వాళ్టి ప్రకారం.. దేశ రాజధానిలో పెట్రోల్ లీటర్ ఒక్కింటికి రూ.96.72 పైసలు, డీజిల్ రూ.89.62 పైసలు పలుకుతోంది. ముంబైలో పెట్రోల్ లీటర్ ఒక్కింటికి రూ111.35 పైసలు, డీజిల్ రూ.97.28 పైసలుగా నమోదైంది. కోల్‌కతలో పెట్రోల్ రూ.106.03 పైసలు, డీజిల్ రూ.92.76 పైసలుగా ఉంటోంది.

చెన్నైలో పెట్రోల్ రేటు రూ.102.63 పైసలు, డీజిల్ 94.24 పైసలు. బెంగళూరులో పెట్రోల్ రూ.101.94 పైసలు, డీజిల్ రూ.87.89 పైసలుగా ఉంటోంది. లక్నోలో పెట్రోల్ రూ.96.57 పైసలు, డీజిల్ 89.76 పైసలు, విశాఖపట్నంలో పెట్రోల్ రూ.110.48 పైసలు, డీజిల్ 98.38 పైసలుగా నమోదైంది.
అహ్మదాబాద్‌లో పెట్రోల్ రూ.96.63 పైసలు, డీజిల్ 92,38 పైసలు, హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.109.66 పైసలు, డీజిల్ రూ.97.82 పైసలు, పాట్నాలో పెట్రోల్ 107.24 పైసలు, డీజిల్ రూ.94.04 పైసలు పలుకుతోంది. తిరువనంతపురంలో పెట్రోల్ 107.87 పైసలు, డీజిల్ రూ.96.67 పైసలుగా నమోదైంది.
కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీని తగ్గించిన తరువాత మూడు రాష్ట్రాలు మాత్రమే తాము వసూలు చేస్తోన్న విలువ ఆధారిత పన్నును తగ్గించాయి. రాజస్థాన్, కేరళ, మహారాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్‌ను కుదించాయి. బీజేపీ పాలిత రాష్ట్రాలు సైతం పెట్రోల్, డీజిల్ ధరలపై అమలు చేస్తోన్న వ్యాట్‌ను తగ్గించడానికి పెద్దగా ఆసక్తి చూపలేదు.. ఇదివరకట్లా. గతంలో కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీని కుదించిన అనంతరం మెజారిటీ రాష్ట్రాలు అదే దారిలో నడిచిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications