క్రూడాయిల్ సెగ నుంచి కాస్త ఉపశమనం: పెట్రోల్, డీజిల్‌ రేట్లల్లో

న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలు కాసింత తగ్గుముఖం పట్టాయి. నిన్నటివరకు 120 డాలర్లకు పైగా పలికిన బ్యారెల్ క్రూడ్ రేటు కాస్త తగ్గింది. బ్రెంట్ ఫ్యూచర్స్ ట్రేడింగ్‌లో 118.66 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. ఇదివరకు ఈ ధర 123 డాలర్లుగా ఉండేది. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్‌‌లోనూ దాదాపు ఇదే ప్రైస్ కనిపిస్తోంది. అక్కడ ఒక బ్యారెల్ క్రూడాయిల్ రేటు 116.74 డాలర్లు పలుకుతోంది.

దీని ప్రభావం దేశీయ ఇంధన అమ్మకాలపై ప్రస్తుతానికి పడట్లేదు. పాత రేట్లే కొనసాగుతున్నాయి. ఇవ్వాళ్టి ప్రకారం.. దేశ రాజధానిలో పెట్రోల్ లీటర్ ఒక్కింటికి రూ.96.72 పైసలు, డీజిల్ రూ.89.62 పైసలు పలుకుతోంది. ముంబైలో పెట్రోల్ లీటర్ ఒక్కింటికి రూ111.35 పైసలు, డీజిల్ రూ.97.28 పైసలుగా నమోదైంది. కోల్‌కతలో పెట్రోల్ రూ.106.03 పైసలు, డీజిల్ రూ.92.76 పైసలుగా ఉంటోంది.

Petrol and diesel prices on June 13, 2022: check here todays fuel rates in your city

చెన్నైలో పెట్రోల్ రేటు రూ.102.63 పైసలు, డీజిల్ 94.24 పైసలు. బెంగళూరులో పెట్రోల్ రూ.101.94 పైసలు, డీజిల్ రూ.87.89 పైసలుగా ఉంటోంది. లక్నోలో పెట్రోల్ రూ.96.57 పైసలు, డీజిల్ 89.76 పైసలు, విశాఖపట్నంలో పెట్రోల్ రూ.110.48 పైసలు, డీజిల్ 98.38 పైసలుగా నమోదైంది.

అహ్మదాబాద్‌లో పెట్రోల్ రూ.96.63 పైసలు, డీజిల్ 92,38 పైసలు, హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.109.66 పైసలు, డీజిల్ రూ.97.82 పైసలు, పాట్నాలో పెట్రోల్ 107.24 పైసలు, డీజిల్ రూ.94.04 పైసలు పలుకుతోంది. తిరువనంతపురంలో పెట్రోల్ 107.87 పైసలు, డీజిల్ రూ.96.67 పైసలుగా నమోదైంది.

కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీని తగ్గించిన తరువాత మూడు రాష్ట్రాలు మాత్రమే తాము వసూలు చేస్తోన్న విలువ ఆధారిత పన్నును తగ్గించాయి. రాజస్థాన్, కేరళ, మహారాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్‌ను కుదించాయి. బీజేపీ పాలిత రాష్ట్రాలు సైతం పెట్రోల్, డీజిల్ ధరలపై అమలు చేస్తోన్న వ్యాట్‌ను తగ్గించడానికి పెద్దగా ఆసక్తి చూపలేదు.. ఇదివరకట్లా. గతంలో కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీని కుదించిన అనంతరం మెజారిటీ రాష్ట్రాలు అదే దారిలో నడిచిన విషయం తెలిసిందే.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+