డబ్బు క్యాష్‌లో ఇస్తే సేఫ్ అనుకుంటున్నారా? అయితే పన్ను శాఖ మీపై కన్నేస్తుంది!

భారతదేశంలో చాలామంది "క్యాష్ ఇస్తే ఫార్మాలిటీస్ ఉండవు" అనుకుని నిర్లక్ష్యంగా నగదు లావాదేవీలు చేస్తుంటారు. కానీ ఇప్పుడు జాగ్రత్త! రూ. 20,000 దాటితేనే పన్నుశాఖ మీపై కన్నేసే అవకాశం ఉంది. అంటే, మీరు ఎవరికైనా రూ. 25,000 నగదుగా ఇచ్చినా లేదా తీసుకున్నా, అదే రూ. 25,000ను పన్నుశాఖ జరిమానాగా కూడా వేసే అవకాశం ఉంటుంది.

ఆదాయపు పన్ను చట్టం, 1961 లోని Section 271DD ప్రకారం, నగదు రూపంలో రూ. 20,000 కంటే ఎక్కువ తీసుకుంటే లేదా ఇస్తే, అదే మొత్తాన్ని జరిమానాగా విధించే అధికారం పన్నుశాఖకు ఉంది.

Penalty Alert Cash deals above Rs 20 000 can cost you double

పన్ను చట్ట సంస్థలో డైరెక్ట్ టాక్స్ భాగస్వామి గౌరవ్ జైన్ చెబుతున్నట్లుగా Section 269SS ప్రకారం, ఇది స్నేహితులు లేదా బంధువుల మధ్య వ్యక్తిగత లావాదేవీలకూ వర్తిస్తుంది. అంటే మీరు స్నేహితుడి దగ్గర నుంచి రూ. 20,000 పైగా నగదుగా లోన్ తీసుకుంటే, అది నిబంధనలకు విరుద్ధం. అలా తీసుకుంటే Section 271D కింద తీసుకున్న మొత్తానికి సమానంగా జరిమానా పడుతుంది.
ఉదాహరణకి మీరు నగదుగా రూ. 30,000 తీసుకుంటే, అదే రూ. 30,000ను జరిమానా కింద కూడా చెల్లించాల్సి వస్తుంది.

Section 269ST ప్రకారం, ఒకే వ్యక్తి దగ్గర నుంచి ఒకే రోజులో రూ. 2 లక్షల కంటే ఎక్కువ నగదు తీసుకోవడం పూర్తిగా నిషేధం. ఒక్క ట్రాన్సాక్షన్ అయినా సరే, లేదా ఒక్క ఈవెంట్‌కు సంబంధించిన మొత్తం చెల్లింపులు కలిపినా ఈ లిమిట్‌ దాటితే సమస్య వస్తుంది. ఇలా చేస్తే Section 271DA కింద మీరు తీసుకున్న నగదు మొత్తానికే సమానంగా జరిమానా పడే అవకాశం ఉంటుంది. అయితే ప్రభుత్వం, బ్యాంకులు, పోస్టాఫీస్ లాంటి సంస్థల నుండి తీసుకునే నగదు మాత్రం ఈ నిబంధనలకు మినహాయింపు అవుతుంది.

Section 269T ప్రకారం, రూ. 20,000 కంటే ఎక్కువ ఉన్న లోన్ లేదా డిపాజిట్‌ను నగదుగా తిరిగి చెల్లించడం నిషేధం. అంటే, ఇంత పెద్ద మొత్తం నగదుగా రీపేమెంట్ చేస్తే అది నిబంధన ఉల్లంఘనగా పరిగణించబడుతుంది. ఇలా చేస్తే Section 271E కింద, మీరు చెల్లించిన మొత్తానికే సమానంగా జరిమానా పడే అవకాశం ఉంటుంది. అయితే ప్రభుత్వం, బ్యాంకులు వంటి కొన్ని సంస్థలకు ఈ నియమం వర్తించదు. వీటికి మినహాయింపు ఉంటుంది.

2025 ఏప్రిల్‌లో సుప్రీం కోర్టు ఆఫ్ ఇండియా (Civil Appeal No. 5200 of 2025) ఇచ్చిన తీర్పులో ఒక కీలక అంశం స్పష్టం చేసింది. నగదుగా రూ. 2 లక్షల కంటే ఎక్కువ ఇచ్చే లేదా తీసుకునే లావాదేవీలు అన్నీ Section 269ST కిందకి వస్తాయని తెలిపింది. అలాంటి లావాదేవీలను తప్పనిసరిగా ఇన్కమ్ టాక్స్ శాఖకి తెలియజేయాలని కోర్టు ఆదేశించింది. అలాగే, ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ సమయంలో ఎవరైనా నగదుగా చెల్లిస్తే, సబ్-రిజిస్ట్రార్‌లు ఆ విషయాన్ని వెంటనే పన్నుశాఖకు సమాచారం ఇవ్వాలని సూచించింది. ఇలా చేయకపోతే, సంబంధిత అధికారులపై క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకోవచ్చని కోర్టు హెచ్చరించింది.

ఈ రోజుల్లో పెద్ద మొత్తాల లావాదేవీలు చేయాలంటే బ్యాంక్ లేదా డిజిటల్ మార్గాలనే వాడటం చాలా సేఫ్. ఎందుకంటే ఇప్పుడు ఉన్న పన్ను చట్టాల ప్రకారం, పెద్ద మొత్తాలను బ్యాంక్ ట్రాన్స్ఫర్, UPI, చెక్ లేదా డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా చెల్లిస్తేనే రికార్డ్ క్లియర్‌గా ఉంటుంది. ఇలా చేస్తే మీరు ఎవరికి ఎంత చెల్లించారో, ఎప్పుడు చెల్లించారో అన్నదానికి ప్రూఫ్ ఉంటుంది.

అదే నగదుగా ఇస్తే రికార్డ్ ఉండదు, పన్నుశాఖకు అనుమానం వస్తుంది "ఎందుకు కాష్‌లో ఇచ్చారు?" అని. కానీ డిజిటల్ లేదా బ్యాంక్ మార్గాల్లో ఇస్తే, అది ఆటోమేటిక్‌గా బ్యాంక్ స్టేట్‌మెంట్‌లో రికార్డ్ అవుతుంది. ఈ రికార్డ్ వల్ల పన్నుశాఖకు కూడా క్లారిటీ వస్తుంది కాబట్టి, మీపై ఎలాంటి ప్రశ్నలు అడిగే అవకాశమే ఉండదు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+