కరోనా మహమ్మారి వల్ల ఉద్యోగులకు కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చాయి. విద్యార్థులకు ఆన్-లైన్ క్లాసులు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో పర్సనల్ కంప్యూటర్ మార్కెట్ భారీగా పుంజుకుంది. డెస్క్‌టాప్, నోట్‌బుక్స్, వర్క్ స్టేషన్స్, లాప్‌టాప్ సేల్స్ పెరిగాయి. ఏడాది ప్రాతిపదికన సెప్టెంబర్ త్రైమాసికంలో పర్సనల్ కంప్యూటర్ (PC) షిప్‌మెంట్ 9.2 శాతం 34 లక్షల యూనిట్లకు పెరిగింది. ఈ మేరకు ఐడీసీ మంగళవారం తన నివేదికలో వెల్లడించింది. గత ఏడేళ్ల కాలంలో ఓ త్రైమాసికంలో అత్యధిక సేల్స్ ఈ జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలోనే ఉండటం గమనార్హం.

కన్స్యూమర్ విభాగం భారీగా జంప్
దేశంలో 2019 సెప్టెంబర్ త్రైమాసికంలో 31 లక్షల PCలు విక్రయించబడ్డాయి. ప్రభుత్వ, విద్యా సంబంధ ప్రాజెక్టులు తక్కువ ఉండడంతో కమర్షియల్ విభాగం 14 లక్షల యూనిట్లకు పరిమితం అయింది. కన్స్యూమర్ విభాగం ఏకంగా 20 లక్షల యూనిట్లకు చేరుకుంది. ఈ విభాగం క్రితం ఏడాదితో పోలిస్తే 41.7 శాతం, జూన్ త్రైమాసికంతో పోలిస్తే 167.2 శాతం వృద్ధిని సాధించింది. జూలై-సెప్టెంబర్ ఇప్పటికే రికార్డ్ త్రైమాసికంగా నిలువగా, అక్టోబర్-డిసెంబర్ కూడా బలమైన త్రైమాసికంగా నమోదు కావొచ్చునని ఐడీసీ అంచనా వేస్తోంది.

ఏ కంపెనీ సేల్స్ ఎంత పెరిగాయంటే
మార్కెట్ వాటా విషయానికి వస్తే HP సేల్స్ 28.2 శాతంతో అన్నింటి కంటే ముందు నిలిచాయి. లెనోవో 21.7 శాతం, డెల్ టెక్నాలజీస్ 21.3 శాతం, ఏసర్ 9.5 శాతం, ఆసుస్ 7.5 శాతం సేల్స్‌తో ఉన్నాయి. షియోమీ, అవిటా సేల్స్ కూడా పెరిగినప్పటికీ, టాప్ 5లోకి చేరలేదు.
కన్స్యూమర్, కమర్షియల్ సెగ్మెంట్‌లలో HP సేల్స్ ఈసారి 16.6 శాతం, లెనోవో సేల్స్ 27 శాతం, డెల్ షిప్‌మెంట్స్ 18.2 శాతం పెరిగాయి.

నోట్ బుక్స్‌కు డిమాండ్
PC మార్కెట్లో సరఫరా కంటే డిమాండ్ అధికంగా కనిపించింది. కొన్నిచోట్ల స్టాక్స్ లేకుండా పోయాయి. వర్క్ ఫ్రమ్ హోం, ఆన్ లైన్ క్లాసుల నేపథ్యంలో అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికం అమ్మకాల్లో బలమైన వృద్ధి ఉంటుందని అంచనా. ఆపిల్ గత ఏడాదితో పోలిస్తే 19.4 శాతం అధికంగా అమ్మకాలు సాధించింది. ఇప్పటి వరకు అత్యధిక సేల్స్‌తో రికార్డు నమోదు చేసింది. విద్యా సంస్థల్లో ఆన్‌లైన్ క్లాసుల నేపథ్యంలో పట్టణ ప్రాంతాల్లో నోట్‌బుక్స్ డిమాండ్ మరింత పెరగనుందని ఐడీసీ తెలిపింది. బ్రాడ్ బ్యాండ్ కనెక్టివిటీ పెరుగుతున్నందున డిమాండ్ మరికొన్ని త్రైమాసికాలు ఉంటుందని భావిస్తున్నారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications