Paytm: కొంప ముంచుతోన్న పేటీఎం షేర్లు.. వరుసగా రెండో రోజు భారీగా పడిన స్టాక్..
శుక్రవారం కూడా పేటీఎం(Paytm) షేర్లు భారీగా పడిపోయాయి. లోయర్ సర్య్కూట్ తాకాయి. ఈ స్టాక్ 20 శాతం పడిపోయింది. 121 పాయింట్లు పడిపోయి రూ.487 వద్ద ట్రేడవుతోంది. పేటీఎం షేర్లు గురువారం కూడా 20 శాతం పడిపోయాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేటీఎంపై ఆంక్షాలు విధించాయి. పేటీఎం ఫిబ్రవరి 29 తర్వాత కొత్త డిపాజిట్లను స్వీకరించడం, క్రెడిట్ లావాదేవీలను నిర్వహించడంపై పరిమితిని విధించింది. ఆర్బీఐ ఆదేశాలతో బ్రోకరేజీలు అప్రమత్తం అయ్యాయి.
జెఫరీస్ పేటీఎమ్‌ని 'బై' నుంచి అండర్ పెర్ఫార్మ్ కి తగ్గించింది, టార్గెట్ ధరను సగానికి పైగా తగ్గించి ఒక్కో షేరుకు రూ. 1,050 నుంచి రూ. 500కి తగ్గించింది. "ఆపరేషనల్ లేదా గవర్నెన్స్ సమస్యల కారణంగా లెండింగ్ పార్టనర్‌లు వ్యాపారాన్ని పరిమితం చేస్తే Paytm రుణ వ్యాపారంపై కీలక ప్రభావం పడుతుంది" అని జెఫ్రీస్ పేర్కొన్నారు.కంపెనీ లాభదాయకత స్వల్పకాలంలో ప్రభావితం అయినప్పటికీ పేటీఎం దీర్ఘకాలికంగా మెరుగుపడుతుందని అరిహంత్ క్యాపిటల్ అంచనా వేసింది.

పేటీఎం షేర్లు లోయర్ సర్క్యూట్లు తాకడంపై పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ మాట్లాడారు. పేటీఎం ఇతర బ్యాంకులతో కలిసి పని చేస్తుందని.. ఇది పేమెంట్స్ బ్యాంకు కాదని పేర్కొన్నారు. పెద్ద బ్యాంకుల నుంచి తమకు సపోర్ట్ ఉందని వివరించాడు. ఆర్బీఐ తీసుకున్న చర్యలపై తమకు ఎలాంటి సమాచారం లేదని చెప్పారు. " Paytmer మీకు ఇష్టమైన యాప్ పనిచేస్తోంది. ఫిబ్రవరి 29 తర్వాత కూడా యథావిధిగా పని చేస్తూనే ఉంటుంది" అని శేఖర్ శర్మ ట్వీట్(ఎక్స్) చేశారు.


Click it and Unblock the Notifications