ఉద్యోగులకు ప్రభుత్వం భారీ షాక్, వారికి ఊరట: ఎందుకు ఇలా చేసింది?

కరోనా మహమ్మారి-లాక్ డౌన్ నేపథ్యంలో కంపెనీలు, ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోవడంతో కంపెనీలకు ఆదాయం లేదు. దీంతో వివిధ రంగాల్లోని చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు వేతనాలు తగ్గిస్తున్నాయి. కొన్ని కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. అయితే ప్రస్తుత క్లిష్టపరిస్థితుల్లో మానవతా దృక్పథంతో కంపెనీలు ఉద్యోగులను తొలగించవద్దని, వేతనాలు తగ్గించవద్దని ప్రధాని నరేంద్ర మోడీ ప్రయివేటు కంపెనీలకు విజ్ఞప్తి చేశారు. కంపెనీలు కూడా నిధుల లేమితో అల్లాడుతున్నాయి.

వేతనాల చెల్లింపు తప్పనిసరి కాదు

వేతనాల చెల్లింపు తప్పనిసరి కాదు

లిక్విడిటీ ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిశ్రమలకు ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది. లాక్ డౌన్ సమయంలో పని చేయని ఉద్యోగులకు వేతనాలు చెల్లించడం తప్పనిసరి కాదని తెలిపింది. ఈ మేరకు గతంలో ఇచ్చిన అదేశాలను రద్దు చేస్తూ ఆదివారం హోంవ్యవహారాల మంత్రిత్వ శాఖ (MAH) ఉత్తర్వులను జారీ చేసింది. దీని ప్రకారం లాక్ డౌన్ సమయంలో పని చేయని ఉద్యోగులకు కంపెనీలు వేతనాలు చెల్లించడం తప్పనిసరి కాదు.

ఉద్యోగులకు ఊరటనిచ్చేలా నాటి ఉత్తర్వులు..

ఉద్యోగులకు ఊరటనిచ్చేలా నాటి ఉత్తర్వులు..

కరోనా కారణంగా పరిశ్రమలు మూతబడినా ఎలాంటి కోతలు లేకుండా ఉద్యోగులకు వేతనాలు చెల్లించాలని మార్చి 29వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది MAH. ఇప్పుడు దానిని విత్ డ్రా చేసుకుంది.

ఎందుకు జారీ చేయాల్సి వచ్చింది..

ఎందుకు జారీ చేయాల్సి వచ్చింది..

సంక్షోభాన్ని అడ్డం పెట్టుకొని ఐటీ ఉద్యోగులను తొలగించకుండా వారి జీతాల్లో కోత విధించకుండా ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిల్‌ను సుప్రీం కోర్టు గత వారం తిరస్కరించింది. అలాగే మార్చి 20న కార్మిక కార్యదర్శి నోటిఫికేషన్, మార్చి 29న MAH నోటిఫికేషన్ పైన ఓ సంస్థ రిట్ పిటిషన్ దాఖలు చేసింది. లాక్ డౌన్ సమయంలో తప్పనిసరిగా వేతనాలు చెల్లించాలన్న ప్రభుత్వ ఉత్తర్వును సవాల్ చేసింది. దీనిపై స్పందించిన సుప్రీం కోర్టు.. లాక్ డౌన్ కాలంలో తమ ఉద్యోగులకు పూర్తి వేతనాలు చెల్లించలేని సంస్థలపై బలవంతపు చర్యలు తీసుకోవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆదాయం లేకుండా కంపెనీలు వేతనాలు ఎలా చెల్లిస్తాయని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. దీనికి ప్రభుత్వం సమాధానం కనుక్కోవాలని పేర్కొంది. దీంతో MAH తాజా ఆదేశాలు జారీ చేసింది.

సుప్రీం ఆదేశాలతో.. కంపెనీలకు భారీ ఉపశమనం

సుప్రీం ఆదేశాలతో.. కంపెనీలకు భారీ ఉపశమనం

మరోవైపు కరోనా కారణంగా వ్యాపారాలు లేవు. డిమాండ్ లేమి కారణంగా వ్యాపారులు, సంస్థలు నష్టాల్లో ఉన్నాయి. లాక్ డౌన్ కారణంగా వ్యాపారాలు దెబ్బతిన్నాయని, తమ ఉద్యోగులకు ప్రభుత్వం వేతనాలు చెల్లించాలని కూడా కొన్ని రంగాలు డిమాండ్ చేస్తున్నాయి. లేదా వేతనాలు చెల్లించకుండా లేదా తగ్గించేలా తమకు వెసులుబాటు కల్పించాలని కూడా కోరుతున్నాయి. సుప్రీం కోర్టు ఆదేశాల నేపథ్యంలో ప్రభుత్వం చర్య కంపెనీలకు భారీ ఉపశమనం. వేతనాలు చెల్లించని సంస్థలపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని ప్రభుత్వానికి సుప్రీం కోర్టు సూచించింది.

అప్పుడేం చెప్పారు..

అప్పుడేం చెప్పారు..

మార్చి 29వ తేదీన ఉత్తర్వుల ప్రకారం... యజమానులు అందరు కూడా తమ ఉద్యోగులకు వేతనాలు చెల్లించాలి. ఎలాంటి తగ్గింపులు లేకుండా చెల్లించాలి. లాక్ డౌన్ సమయంలోను ఉద్యోగులు హాజరు కాకపోయినప్పటికీ వేతనాలు ఇవ్వవలసి ఉంటుంది. 18వ తేదీన జారీ చేసిన లాక్ డౌన్ మార్గదర్శకాలలో వేతనాలకు సంబంధించిన అంశం లేదు. విపత్తు నిర్వహణ చట్టం, 2005లోని సెక్షన్ 10(2)(1) కింద నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ గతంలో ఇచ్చిన ఉత్తర్వులు రద్దవుతాయని తెలిపారు. వాటిలోనే మార్చి 29న వేతనాలకు సంబంధించిన జారీ చేసిన ఉత్తర్వు లేదు.

వేతనాలు చెల్లించాలని డిమాండ్

వేతనాలు చెల్లించాలని డిమాండ్

పరిశ్రమలు, పారిశ్రామిక సంఘాలు ప్రభుత్వం నుండి వేతన ఉద్దీపనలు కోరుతున్నాయి. కనీసం రెండు నెలల వేతనాలు తమకు ఇవ్వాలని కొందరు చెబుతుండగా, 50 శాతం వేతనం భరించాలని మరికొన్ని సంస్థలు కోరుతున్నాయి. ఉపశమనం లేకుంటే ఉద్యోగుల తొలగింత ఉంటుందని చెప్పాయి. ఇప్పటి వరకు ఉద్యోగులకు వేతనాలు అందినా ఇక నుండి విధులకు హాజరు కాకుంటే కోత తప్పదు. ఇప్పటికే ఆంక్షలు క్రమంగా ఎత్తి వేస్తున్నారు. మరోవైపు కార్యాలయాలు తెరుచుకుంటున్నాయి. క్రమంగా కంపెనీలు తెరుచుకుంటున్న క్రమంలో ఈ ఆదేశాలు రావడం గమనార్హం. అంటే ఉద్యోగానికి వస్తే వేతనం ఉంటుంది. ఇప్పటి వరకు రాకపోయినా వేతనం ఇచ్చారు. ఇక నుండి ఆ ఉత్తర్వు చెల్లదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+