న్యూఢిల్లీ: నవంబర్ నెలలో దీపావళి పండుగ నేపథ్యంలో వాహనాల సేల్స్ పెరిగాయి. ఫెస్టివెల్ సీజన్ కలిసి వచ్చినట్లు సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్(SIAM) తెలిపింది. దేశంలో పాసింజర్ వెహికిల్ హోల్‌సేల్ విక్రయాలు 4.65 శాతం పెరిగి 2,64,898కి చేరినట్లు తెలిపింది. 2019 నవంబర్ నెలలో 2,53,139 విక్రయాలు నమోదయ్యాయి. అంటే ఏడాది ప్రాతిపదికన దాదాపు 5 శాతం పెరిగాయి. ఇటీవలి అంచనాల్లో సేల్స్ 13 శాతం పెరిగినట్లుగా కనిపిస్తోందని చెబుతున్నారు. SIAM గణాంకాల ప్రకారం బైక్ సేల్స్ 13 శాతం పెరిగాయి.

బైక్స్ ఎంత పెరిగాయంటే
పండుగ సీజన్‌కు తోడు కరోనా వైరస్ నేపథ్యంలో వ్యక్తిగత ప్రయాణానికి ప్రాధాన్యత ఏర్పడిందని, అందుకే విక్రయాలు పెరిగినట్లు SIAM తెలిపింది. SIAM డేటా ప్రకారం బైక్ సేల్స్ 2019 నవంబర్ నెలలో 14,10,939 కాగా, ఈ నవంబర్ నెలలో 13.43 శాతం పెరిగి 16,00,379కి చేరాయి. మోటార్ సైకిల్ విక్రయాలు 8,93,538 నుండి 15 శాతం పెరిగి 10,26,705గా నమోదయ్యాయి. స్కూటర్ విక్రయాలు 4,59,851 నుండి 9 శాతానికి పైగా పెరిగి 5,02,561 యూనిట్లకు పెరిగాయి. ఆటో సేల్స్ విషయానికి వస్తే 55,778 నుండి 57 శాతానికి పైగా పెరిగి 23,626కు పెరిగాయి.

కారు విక్రయాలు...
బైక్స్, త్రీ, క్వాడ్రిసైకిల్స్ వంటి మొత్తం ప్రయాణీకుల వాహన ఉత్పత్తి 22,96,701గా ఉండగా, గత ఏడాది ఇదే సమయంలో 22,58,290గా ఉంది. 1.7 శాతం వృద్ధి నమోదు చేసింది. మారుతీ సుజుకీ నవంబర్ నెలలో డీలర్లకు 1,35,775 వాహనాలు పంపించగా, గత ఏడాది ఇదే సమయం కంటే 2.41 శాతం తక్కువ. హ్యుండాయ్ మోటార్ ఇండియా 48,800 హోల్ సేల్ వెహికిల్ విక్రయాలు నమోదు చేసింది. ఇది 9.42 శాతం ఎక్కువ. కియా మోటార్స్ 50 శాతానికి పైగా పెరిగి 21,022, మహీంద్రా అండ్ మహీంద్రా దాదాపు 25 శాతం పెరిగి 21,022 హోల్ సేల్ వెహికిల్ విక్రయాలు నమోదయ్యాయి.

అందుకే వ్యక్తిగత వాహనాలు
కరోనా లాక్ డౌన్ కారణంగా మార్చి చివరి వారం నుండి విక్రయాలు లేక ఆటో పరిశ్రమ తీవ్రంగా దెబ్బతిన్నది. ఏప్రిల్ నెలలో జీరో విక్రయాలు నమోదు చేసిన సంస్థలు కూడా ఉన్నాయి. కరోనా తర్వాత ప్రజలు పబ్లిక్ ట్రాన్సుపోర్టును తగ్గించి వ్యక్తిగత వాహనాల కోసం మొగ్గు చూపుతున్నారు. దీంతో సేల్స్ పెరిగాయి.


Click it and Unblock the Notifications