మోడీ లక్ష్యం, 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థకు మరో 3 ఏళ్ళు ఆలస్యం
వచ్చే అయిదేళ్లలో భారత ఆర్థిక వ్యవస్థను 5 లక్షల కోట్ల డాలర్లకు తీర్చిదిద్దాలని నరేంద్ర మోడీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 2019లో ఆర్థిక మందగమనం కారణంగానే ఇది ఆలస్యమవుతుందని అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీలు అంచనా వేయగా, తాజాగా కరోనా మహమ్మారి నేపథ్యంలో ఇది మరింత ఆలస్యమవుతుందని బ్యాంక్ ఆఫ్ అమెరికా సెక్యూరిటీస్ అంచనా వేసింది. 2019-20తో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ 15.7 శాతం క్షీణించిందని పేర్కొంది. ఈ నేపథ్యంలో 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదిగేందుకు మూడేళ్లు ఆలస్యమై 20.31-32కు సాకారం కావొచ్చునని అంచనా వేసింది.

అందుకే ఆలస్యం
ప్రస్తుతం భారత్ ప్రపంచ అయిదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచింది. అమెరికా మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత చైనా, జపాన్, జర్మనీ ఉన్నాయి. ఆ తర్వాత భారత్ ఐదో స్థానంలో ఉంది. 2030 నాటికి 5 లక్షల డాలర్లతో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలవాలని మోడీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 2031-32 నాటికి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలిచే అవకాశముందని తెలిపింది. ఇదివరకు 2028-29 నాటికి ఈ లక్ష్యాన్ని చేరుకుంటుందని భావించినప్పటికీ కరోనా నేపథ్యంలో ప్రతికూలంగా మారిందని పేర్కొంది.

గతంలో ఏం చెప్పిందంటే
తొమ్మిది శాతం జీడీపీ వృద్ధితో అయితే భారత్ 2031 నాటికి, పది శాతం అయితే 2030 నాటికి జపాన్ జీడీపీని తాకవచ్చునని పేర్కొంది. FY20లో భారత ఆర్థిక వ్యవస్థ 2.65 లక్షల కోట్ల డాలర్లుగా ఉంది. 2020లో జపాన్ ఆర్థిక వ్యవస్థ పరిమాణం 4.87 లక్షల కోట్లుగా ఉంది.

అంచనాల కోసం.
అంచనాల కోసం వాస్తవిక వృద్ధి, ద్రవ్యోల్భణం, రూపాయి పెరుగుదల-క్షీణతలను పరిగణలోకి తీసుకుంది. 2027-28 నాటికి భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని 2017లో బ్యాంక్ ఆఫ్ అమెరికా గతంలో అంచనా వేసింది. స్థిర వృద్ధికి ముడిచమురు ధరలు ఒక్కటే అడ్డంకి అని అభిప్రాయపడింది.


Click it and Unblock the Notifications