ఆధార్ కార్డుతో పర్మినెంట్ అకౌంట్ నెంబర్ (PAN)ను మార్చి 31, 2020 తేదీలోపు లింక్ చేయకుంటే ఆ తర్వాత మీ పాన్ పని చేయదని ఆదాయపు పన్ను శాఖ మరోసారి వెల్లడించింది. ఇప్పటికీ మీ పాన్-ఆధార్‌ను లింక్ చేయకపోతే వెంటనే చేయాలి. పాన్-ఆధార్ అనుసంధానానికి ఐటీ డిపార్టుమెంట్ పలుమార్లు గడువును పొడిగించింది. ప్రస్తుత గడువు మార్చి 31, 2020. జనవరి 27వ తేదీ నాటికి 30.75 కోట్లకు పైగా పాన్ కార్డులు ఆధార్‌తో అనుసంధానమయ్యాయి. మరో 17.58 కోట్లు కావాల్సి ఉంది.

లింక్ చేయకుంటే..
నిబంధనల మేరకు 2017 జూలై 1 వరకు పాన్ కేటాయింపు జరిగిన వ్యక్తులు ఆధార్‌తో అనుసంధానం చేయాలని, మార్చి 31 వరకు అలా చేయకుంటే పాన్ పనిచేయదని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్(CBDT) తెలిపింది. కొన్ని రకాల ట్రాన్సాక్షన్స్ నిర్వహించినప్పుడు పాన్ నెంబర్ వెల్లడించవలసి ఉంటుంది. పాన్ పని చేయకుంటే అది లేనట్టే. కొన్ని ట్రాన్సాక్షన్స్‌కు పాన్ వివరాలు వెల్లడించని వారిపై ఐటీ చట్టం ప్రకారం తీసుకునే చర్యలకు బాధ్యులు కావాల్సి ఉంటుందని CBDT తెలిపింది.

ఆదాయపు పన్ను శాఖ వెబ్ సైట్‌లోకి వెళ్లి...
పాన్ - ఆధార్ లింకింగ్ వివిధ మార్గాల ద్వారా చేసుకోవచ్చు.
- ఇన్‌కం ట్యాక్స్ డిపార్టుమెంట్ వెబ్ సైట్‌లోకి వెళ్లి లింక్ చేసుకోవచ్చు.
- ఇన్‌కం ట్యాక్స్ ఇండియా ఈ-ఫైలింగ్ వెబ్ సైట్‌కు వెళ్లి యూజర్ ఐడీ, పాస్ వర్డ్‌తో లాగిన్ అవాలి.
- ప్రొఫైల్‌లోకి వెళ్లి అక్కడ లింక్ ఆధార్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి.
- అడిగిన వివరాలు ఇచ్చి, పాన్ కార్డుతో ఆధార్‌ను లింక్ చేసుకోవాలి.

ఎస్సెమ్మెస్ ద్వారా లింక్
- ఎస్సెమ్మెస్ పంపించడం ద్వారా కూడా ఆధార్ - పాన్ లింక్ చేసుకోవచ్చు.
- రిజిస్టర్డ్ మొబైల్ నుండి దీనిని పంపించాలి.
- 567678 లేదా 56161 కు ఎస్సెమ్మెస్ పంపించడం ద్వారా లింక్ చేయవచ్చు.
- మీ ఆధార్ నెంబర్‌ను, పాన్ నెంబర్‌ను ఎస్సెమ్మెస్ చేయాలి.
- UIDPAN అని టైప్ చేసి ఆ తర్వాత ఆధార్, పాన్ నెంబర్ టైప్ చేసి ఎస్సెమ్మెస్ పంపించాలి.

తప్పులు సరి చేసుకోండి..
పాన్ కార్డును ఆధార్‌తో అనుసంధానం చేసే సమయంలో రెండు కార్డుల్లోని వివరాలు మ్యాచ్ కావాలి. అప్పుడే అనుసంధానం అవుతాయి. కొంతమందికి ఇక్కడ సమస్య ఎదురవుతుంది. కొందరి పేరు, పుట్టిన తేదీ ఆధార్‌లో ఒకలా, పాన్ కార్డులో మరోలా ఉంటోంది. అలాంటి వారు వెబ్ సైట్ లేదా ఎస్సెమ్మెస్ పంపించి లింక్ చేయలేరు. మొదట కార్డుల్లోని తప్పులను సరి చేసుకోవాలి.

లింక్ చేయకుంటే...
- పాన్ - ఆధార్‌ను మార్చి 31 లోపు లింక్ చేయకుంటే పాన్ కార్డు చెల్లుబాటు కాకుండా పోతుంది. పాన్ నెంబర్ ఇన్ఆపరేటివ్ లేదా ఇన్‌వ్యాలిడ్ అవుతుంది.
- ఆధార్ - పాన్ కార్డును అనుసంధానం చేయకుంటే ఆదాయపు పన్ను శాఖ ఫైలింగ్‌లోను ఇబ్బందులు తలెత్తవచ్చు.
- పాన్ - ఆధార్ లింక్ చేయకుంటే పాన్ కార్డు ఇన్ఆపరేటివ్ అవుతుంది. కేంద్రం పేర్కొంది.

పాన్ లేనట్లుగానే..
- పాన్, ఆధార్ లింక్ చేయకుంటే మీకు పాన్ లేనట్లుగా భావించే అవకాశాలు ఉంటాయి. లింక్ చేయనప్పుడు పాన్ కార్డు చెల్లుబాటు కాకుండా పోతుంది. అప్పుడు పాన్ లేని కిందకు రావొచ్చు.
- పాన్ - ఆధార్ లింక్ చేయకుంటే పాన్ ద్వారా ఇండివిడ్యువల్స్ ఎవరు కూడా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. - కొందరికి ఒకటికి మించి కార్డులు ఉండే అవకాశాలున్నాయి. అలాంటి వారు ఓ కార్డును లింక్ చేశాక, మిగతా కార్డులు చెల్లుబాటు కాకుండా పోవచ్చు.
- పాన్ ఆధార్ లింక్ చేయకుంటే పాన్ కార్డు లేనట్లుగా భావించవచ్చు. దీంతో ఐటీ రిటర్న్స్ దాఖలు చేసే సమయంలో, పన్నుల విషయంలో, ఇతర ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అంశంలో మీరు పాన్ కార్డును ఉపయోగించలేరు. అప్పుడు అధిక పన్ను రేటుకు అవకాశాలు ఉంటాయి. అయితే ఇటీవల ఆధార్ ద్వారా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసేందుకు కేంద్రం వెసులుబాటు కల్పించింది. కాబట్టి పాన్ లేకపోయినా ఆధార్ ద్వారా అన్ని ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ నిర్వహించుకోవచ్చా అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది.


Click it and Unblock the Notifications