For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పాన్-ఆధార్ లింక్ డెడ్‌లైన్ మార్చి 31, రూ.10,000 ఫైన్ తప్పించుకోండి!

|

పాన్ - ఆధార్ కార్డు లింక్ చేసుకోవడానికి ఈ నెల (మార్చి) 31 తుది గడువు. ఈ లోపు అనుసంధానం చేసుకోకుంటే పాన్ కార్డు పని చేయదు. అదే పాన్ నెంబరుతో ట్రాన్సాక్షన్స్ నిర్వహిస్తే ఐటీ శాఖ జరిమానా విధిస్తుంది. పాన్‌ను ఆధార్‌తో అనుసంధానం చేయని వారు గడువు తేదీ తర్వాత బ్యాంకు ఖాతా ద్వారా ట్రాన్సాక్షన్స్ నిర్వహిస్తే ఐటీ శాఖ రూ.10,000 జరిమానా విధించే అవకాశముంది. నిబంధనలు ఉల్లంఘిస్తే మరిన్నిసార్లు జరిమానా ఉండొచ్చు.

వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారా?: జియో, బీఎస్ఎన్ఎల్ సూపర్ ఆఫర్వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారా?: జియో, బీఎస్ఎన్ఎల్ సూపర్ ఆఫర్

బ్యాంక్ అకౌంట్ ప్రారంభించేందుకు, స్థిరాస్తుల అమ్మకాలు లేదా కొనుగోళ్లకు, రుణ దరఖాస్తుకు, క్రెడిట్ కార్డు దరఖాస్తుకు, పెట్టుబడులకు పాన్‌కార్డు అవసరం. ఇన్‌కం ట్యాక్స్ డిపార్టుమెంట్ వెబ్ సైట్‌లోకి వెళ్లి పాన్-ఆధార్‌ను అనుసంధానం చేసుకోవచ్చు.

 Pan and Aadhaar link: You could be fined Rs 10,000, if you miss the March 31 deadline

బయో మెట్రిక్ ధ్రవీకరణ, ఎన్ఎస్డీఎల్, యూటీఐటీఎస్ఎల్ పాన్ సేవా కేంద్రాల ద్వారా కూడా అనుసంధానం చేసుకోవచ్చునని ఐటీ విభాగం గతంలోనే ఓ ప్రకటనలో తెలిపింది. రెండు మార్గాల్లో లింకింగ్ ప్రక్రియ పూర్తి చేయవచ్చునని పేర్కొంది. ఆధార్ కార్డును ఎస్సెమ్మెస్ ద్వారా కూడా లింక్ చేసుకోవచ్చు. ఆదాయపు పన్ను శాఖ పాన్-ఆధార్ లింక్ కోసం పలుమార్లు గడువులు ఇచ్చింది. ఈసారి గడువు పెంపొందించే అవకాశాలు లేవు. కాబట్టి ముందే లింక్ చేసుకోవడం మంచిది.

English summary

పాన్-ఆధార్ లింక్ డెడ్‌లైన్ మార్చి 31, రూ.10,000 ఫైన్ తప్పించుకోండి! | Pan and Aadhaar link: You could be fined Rs 10,000, if you miss the March 31 deadline

Government has set a deadline of March 31, 2020, for linking of PAN cards to Aadhaar. If you are a PAN cardholder and you fail to link it to your Aadhar card within the mentioned deadline then you might have to pay the income tax department a penalty of Rs 10,000 for using an inoperative Permanent Account Number.
Story first published: Sunday, March 22, 2020, 11:28 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X