Pakistan Crisis: అనేక దశాబ్దాలుగా పాకిస్థాన్ చేసిన పాపాలు ప్రస్తుతం అక్కడి ప్రజలను వెంటాడుతున్నాయి. కనీసం తినటానికి కూడా కష్టతరమైన పరిస్థితులు ప్రస్తుతం అక్కడ దాపురించాయి. అప్పుల కోసం తిప్పలు పడుతున్న పాక్‌లో పన్నులతో పాటు పెట్రోల్, గ్యాస్, నిత్యావసరాల ధరలు ఆకాశానికి తాకాయి.

పన్నుల బాదుడు..
షెహబాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాకిస్థాన్ ప్రభుత్వం 33 కేటగిరీల వస్తువులపై సేల్స్ టాక్స్ ను 17 నుంచి 25 శాతానికి పెంచింది. దేశంలోని ఫెడరల్ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ(FBR) రూ.170 బిలియన్ల పన్ను రాబడి చర్యల్లో చివరి భాగాన్ని మార్చి 8 నుంచి అమలు చేయాలని నోటీసు జారీ చేసింది. పాక్ లో అధికారంలో ఉన్న పీడీఎమ్ ప్రభుత్వం ఇప్పటికే రెండు దశల్లో పన్ను చర్యలను ప్రకటించింది. అయితే ఈ చర్యలు అధిక ద్రవ్యోల్బణం, రుణ ఖర్చులతో పాటు ఐఎమ్ఎఫ్ తో ఉన్న 7 బిలియన్ డాలర్ల ఎక్స్‌టెండెడ్ ఫండ్ ఫెసిలిటీ ప్రోగ్రామ్‌ను పూర్తి చేయటంలో భాగంగా తీసుకొచ్చినవిగా తెలుస్తోంది.

పన్ను పెరిగే ఆహారాలు..
పాకిస్థాన్ ప్రభుత్వం తాజాగా తీసుకున్న పన్ను పెంపు నిర్ణయం కారణంగా దిగుతమతి చేసుకునే స్వీట్స్, జామ్ అండ్ జెల్లీలు, చేపలు, సాస్ లు, కెచప్, కార్న్‌ఫ్లేక్స్, ఘనీభవించిన మాంసం, రసాలు, పాస్తా, పండ్లు, డ్రై ఫ్రూట్స్, ఎరేటెడ్ వాటర్, ఐస్ క్రీమ్స్, చాక్లెట్లు, జంతువుల ఆహారాల ధరలు పెరగనున్నాయి. వీటికి తోడు చేతి గడియారాలు, ఆభరణాలు, గృహోపకరణాలు, మట్టి పాత్రలు, బ్యూటీ ప్రాడక్స్, బూట్లు, షాంపూలు వంటి వస్తువులపై సేల్స్ టాక్స్ పెరుగుతోంది.

లగ్జరీ వస్తువులు..
ప్రైవేట్ ఓడలు విమానాలు, సానిటరీ సామాన్లు, ప్రైవేటు ఆయుధాలు, షాన్డిలియర్లు, హెడ్‌ఫోన్‌లు అండ్ లౌడ్‌స్పీకర్లు, తలుపులు, తివాచీలు, టిష్యూ పేపర్స్, ఫర్నిచర్, లగ్జరీ దుప్పట్లు, స్లీపింగ్ బ్యాగులు, మరుగుదొడ్లు, హీటర్లు, బ్లోయర్స్, సన్ గ్లాసెస్, కిచెన్వేర్, సిగరెట్లు, షేవింగ్ వస్తువులు, లెథర్ గార్మెంట్స్, సంగీత వాయిద్యాలు, హెయిర్ డ్రైయర్స్, అలంకరణ వస్తువులపై పన్ను పోటుకు పాక్ ప్రభుత్వం నిర్ణయించింది.

వాహన ప్రియులకు షాక్..
స్థానికంగా తయారు చేయబడిన లేదా అసెంబుల్ చేయబడిన SUVలు, CUVలు, 1,400cc లేదా అంతకంటే ఎక్కువ ఇంజిన్‌లను కలిగి ఉన్న స్థానికంగా తయారు చేయబడిన లేదా అసెంబుల్ చేయబడిన వాహనాలపై కూడా పెరిగిన పన్నులు వర్తిస్తాయని పాక్ ప్రకటించింది. ఇప్పటికే ఫిబ్రవరి 14న నోటీసుల ద్వారా సిగరెట్లపై ఫెడరల్ ఎక్సైజ్ సుంకం, సాధారణ అమ్మకపు పన్నును 17 శాతం నుంచి 18 శాతానికి పెంచారు.


Click it and Unblock the Notifications