పాకిస్తాన్‌కు బిగ్ షాక్ ఇవ్వబోతున్న భారత్.. చుక్క నీరు లేక విలవిలలాడనున్న దాయాది దేశం..

భారతదేశ సార్వభౌమత్వానికి భంగం కలిగిస్తూ.. సరిహద్దు ఉగ్రవాదానికి ఊతమిస్తున్న పాకిస్థాన్‌కు బుద్ధి చెప్పేందుకు కేంద్ర ప్రభుత్వం అత్యంత వ్యూహాత్మక, కఠినమైన చర్యలకు శ్రీకారం చుట్టింది. సింధు నది నీటిని పూర్తిగా భారతదేశ భూభాగం వైపు మళ్లించి, పాకిస్థాన్ వైపు ఉన్న నదీ పరివాహక ప్రాంతాన్ని పూర్తిగా ఎండిపోయేలా చేయడానికి దేశం శరవేగంగా కృషి చేస్తోందని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సి.ఆర్. పాటిల్ మంగళవారం వెల్లడించారు.

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో గత సంవత్సరం జరిగిన దారుణమైన ఉగ్రదాడికి నిరసనగా, అంతర్జాతీయ చట్టాల ప్రకారం భారత్ తనకున్న సార్వభౌమ హక్కులను ఉపయోగించి సింధు జలాల ఒప్పందాన్ని (IWT) నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యూహాత్మక ప్రాజెక్టుల పురోగతిపై మంత్రి సి.ఆర్. పాటిల్ మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయాలని నిర్ణయించినప్పటి నుండి, ఒక్క చుక్క నీరు కూడా పాకిస్తాన్‌లోకి ప్రవహించకుండా చూసేందుకు అన్ని ప్రయత్నాలూ జరుగుతున్నాయి.

Indus River Indus water treaty India Pakistan water dispute Indus diversion Indus River water India Pakistan relations water politics Indus basin Pakistan water crisis Indus treaty news river water sharing South Asia geopolitics India water policy Pakistan agriculture breaking news

ఆ కష్టతరమైన భౌగోళిక ప్రాంతంలో కఠినమైన ఇంజనీరింగ్ ప్రాజెక్టులను భారత్ అమలు చేస్తోంది. ప్రధానమంత్రి ఆదేశాల మేరకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా ఈ వ్యవహారాన్ని స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఈ పనులు కాలపరిమితితో కూడిన పద్ధతిలో సాగుతున్నాయి. రాబోయే ఒకటిన్నర నుండి రెండు సంవత్సరాలలో పాకిస్తాన్‌కు Indus River జలాల ప్రవాహం పూర్తిగా ఆగిపోతుందని నేను బలంగా నమ్ముతున్నాను. రాబోయే సంవత్సరాల్లో ఒక్క చుక్క నీరు కూడా అక్కడికి వెళ్లదు, ఇది ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. 1960 సెప్టెంబర్ 19న కుదిరిన ఈ చారిత్రాత్మక ఒప్పందాన్ని, సరిహద్దు ఉగ్రవాదానికి పాకిస్తాన్ తన మద్దతును విశ్వసనీయంగా, తిరుగులేని విధంగా విరమించుకునే వరకు పునరుద్ధరించే ప్రసక్తే లేదని భారత్ తేల్చిచెప్పింది.

Also Read

భారతదేశం తీసుకున్న ఈ చారిత్రాత్మక నిర్ణయాన్ని తట్టుకోలేక, అంతర్జాతీయంగా ఒత్తిడి తెచ్చేందుకు పాకిస్తాన్ చట్టవిరుద్ధంగా ఒక మధ్యవర్తిత్వ న్యాయస్థానాన్ని (Court of Arbitration - CoA) ఏర్పాటు చేసింది. అయితే, ఈ సంస్థ ఉనికిని, అది ఇచ్చే ఏ తీర్పులనూ భారతదేశం మొదటి నుండి పూర్తిగా తిరస్కరిస్తూనే ఉంది. గత నెల మే 15, 2026 న ఈ "చట్టవిరుద్ధ" మధ్యవర్తిత్వ న్యాయస్థానం సింధు జలాల ఒప్పందం యొక్క సాధారణ వ్యాఖ్యానం, గరిష్ట లోతు పరిమితికి సంబంధించి జారీ చేసిన తాజా తీర్పును (అవార్డును) భారతదేశం 'చెల్లనిది, శూన్యమైనది' (Null and Void) గా ప్రకటించింది.

ఈ విషయమై కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) మే 16న ఒక అధికారిక ప్రకటన విడుదల చేస్తూ..చట్టవిరుద్ధంగా ఏర్పాటు చేయబడిన కోర్ట్ ఆఫ్ అప్పీల్ (CoA) యొక్క మునుపటి ప్రకటనలన్నింటినీ భారతదేశం ఎలాగైతే గట్టిగా వ్యతిరేకించిందో అలాగే ప్రస్తుత తీర్పును కూడా ఖచ్చితంగా తిరస్కరిస్తుంది. ఈ సంస్థ ఏర్పాటు స్వయంగా సింధు జలాల ఒప్పంద నిబంధనలను తీవ్రంగా ఉల్లంఘించడమే. కాబట్టి ఈ వేదిక ముందు జరిగే ఏవైనా విచారణలు, అది తీసుకునే ఏ నిర్ణయమైనా చట్టవిరుద్ధం. సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయాలన్న భారతదేశ నిర్ణయం యథాతథంగా అమలులో ఉంటుందని స్పష్టం చేసింది.

గతంలో కూడా జమ్మూ, కాశ్మీర్‌లోని కిషన్‌గంగా, రాట్లే జలవిద్యుత్ ప్రాజెక్టులపై ఈ సంస్థ ఇచ్చిన "అనుబంధ అవార్డు"ను విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా తప్పుపట్టింది. ప్రపంచ ఉగ్రవాదానికి కేంద్రంగా మారిన పాకిస్తాన్, తన జవాబుదారీతనం నుండి అంతర్జాతీయ సమాజం దృష్టిని మళ్లించడానికి చేస్తున్న "నిస్సహాయ ప్రయత్నాలు", "నాటకాలు" గా భారత్ వీటిని అభివర్ణించింది. సరిహద్దుల్లో శాంతి నెలకొననంత కాలం పాకిస్తాన్‌కు నీటి ప్రవాహాన్ని ఆపేయాలనే భారత్ సంకల్పం దేశ రక్షణ వ్యూహంలో ఒక మైలురాయిగా నిలవనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+