పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి చాలా కాలంగా దారుణంగా ఉంది. భారతదేశంతో దిగజారుతున్న సంబంధాలు పాక్ దేశ ఆర్థిక పరిస్థితిపై దెబ్బ కొట్టాయి. మే 9న ఇండియా పాక్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల మధ్య అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) పాకిస్తాన్ కి 2.3 బిలియన్ డాలర్ల అంటే సుమారు రూ. 19,500 కోట్ల ఆర్థిక ప్యాకేజీని ఆమోదించింది. ఇందులో ఒక బిలియన్ డాలర్లు సుమారు రూ. 8,500 కోట్లు త్వరలో విడుదల కానున్నాయి.

దీనితో పాటు, రెసిలెన్స్ అండ్ సస్టైనబిలిటీ ఫెసిలిటీ (RSF) కింద $1.3 బిలియన్లు సుమారు రూ. 11,000 కోట్లు ఇవ్వనుంది. అయితే IMF రూ.19,500 కోట్ల ప్యాకేజీ పాకిస్తాన్ పరిస్థితిని మెరుగుపరుస్తుందా అనేది అతిపెద్ద ప్రశ్న. ఈ సహాయంతో కూడా పాక్ దేశ పరిస్థితి మెరుగుపడుతుందనే ఆశలు కూడా చాలా తక్కువ. ఈ కారణంగానే భారతదేశం IFM ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనలేదు ఇంకా తీవ్ర నిరసనను వ్యక్తం చేసింది.
పదే పదే రుణాలు : పాకిస్తాన్ 1950 నుండి IMFలో సభ్యదేశంగా ఉంది. ప్రతిసారీ ఈ దేశం రుణం తీసుకొని ఆర్థిక సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రయత్నిస్తుంది. 1989 నుండి 2024 వరకు ఈ 35 సంవత్సరాలలో చాలా సార్లు IMF నుండి పాక్ రుణాలు తీసుకుంది. దింతో పాకిస్తాన్ పై IMF అప్పు భారీగా పెరిగింది.
పాకిస్తాన్ ప్రభుత్వాలు ఆర్థిక విధానాలలో తప్పులు చేస్తూనే ఉన్నాయి. వేగంగా పెరుగుతున్న జనాభా, తక్కువ పొదుపులు, విద్య ఇంకా ఆరోగ్యం వంటి రంగాలలో తక్కువ పెట్టుబడి పరిస్థితిని మరింత దిగజార్చాయి. భారీ సబ్సిడీలు, విద్యుత్, ఇంధన ధరలను పెంచాల్సిన అవసరం ప్రజలపై భారాన్ని మోపింది. సైనిక వ్యయం ఇంకా ఉగ్రవాదానికి మద్దతు: పాకిస్తాన్ సైనిక బడ్జెట్ దాని ఆర్థిక పరిస్థితి కంటే చాలా ఎక్కువ. పాక్ దేశం రుణం ద్వారా వచ్చిన డబ్బును ఉగ్రవాదం ఇంకా సైనిక కార్యకలాపాలకు ఉపయోగించుకునే అవకాశం ఉందని భారతదేశం IMF సమావేశంలో ఆందోళన వ్యక్తం చేసింది.
ఇతర దేశాలపై ఆధారపడటం: పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ దిగుమతులపై ఎక్కువగా ఆధారపడి ఉంది, అందుకే విదేశీ మారక నిల్వలు ఇతర దేశాల కంటే చాలా తక్కువగా ఉన్నాయి. మే 2025లో పాకిస్తాన్ విదేశీ మారక నిల్వలు $15.58 బిలియన్లుగా ఉండగా, ఇది దీర్ఘకాలిక దిగుమతులకు సరిపోదు. అంతేకాకుండా చైనా, సౌదీ అరేబియా, యుఎఇ వంటి దేశాల నుండి కూడా పాక్ రుణాలు తీసుకుంటుంది. గత రెండు దశాబ్దాల డేటాను మనం పరిశీలిస్తే పాకిస్తాన్ ప్రపంచ వాణిజ్యంలో చాలా బలహీనంగా ఉంది.
జనాభా పెరుగుదల : పాకిస్తాన్ జనాభా వేగంగా పెరగడం వల్ల విద్య, ఆరోగ్యం ఇంకా ప్రాథమిక సౌకర్యాలపై భారీ ఒత్తిడి ఉంది. దీని కారణంగా ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి బలహీనపడుతోంది. అభివృద్ధి ప్రాజెక్టులలో పెట్టుబడులు పెట్టడం పాకిస్తాన్ ప్రభుత్వానికి చాలా కష్టంగా మారుతోంది.


Click it and Unblock the Notifications