Oyo: ఓయో అధినేత రితేష్ పెద్దమనసు.. స్వస్థలంలో 5 భారీ ప్రాజెక్టులకు రూపకల్పన
Ritesh Agarwal: హోటల్ ఇండస్ట్రీలో ఓయో పెనుమార్పు సృష్టించింది అనడంలో సందేహం లేదు. CEO రితేష్ అగర్వాల్ ధాటికి అప్పటి వరకు పరిశ్రమలో దిగ్గజ ప్లేయర్స్‌గా కొనసాగిన కంపెనీలకు పరాభవం తప్పలేదు. సామాజిక కార్యకలాపాల్లోనూ తనదైన ముద్ర వేస్తూ, రితేష్ ముందుకు సాగుతున్నారు.
వెనుకబడిన ప్రజల అభ్యున్నతి కోసం 5 ఆరోగ్య సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ఓయో వ్యవస్థాపకులు, CEO రితేష్ అగర్వాల్ ప్రకటించారు. తన సొంతం రాష్ట్రం ఒడిశాలో వచ్చే ఏడాది నాటికి వీటిని అందుబాటులోకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా 11 ఆరోగ్య కేంద్రాలను నడుపుతున్న హెల్త్-టెక్ స్టార్టప్ లాస్ట్ మైల్ కేర్ ఈ కేంద్రాలను నిర్వహించనుంది.

ఆరోగ్య సంరక్షణ సేవలకు దూరంగా ఉన్న ప్రాంతాలను వీటి ద్వారా కవర్ చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. అట్టడుగు ప్రజలకు కూడా హెల్త్ ఫెసిలిటీస్ అందించి, వారి మధ్య అంతరాన్ని తగ్గించాలని చూస్తున్నారు. ఇందుకోసం మొదటి 3 నెలలపాటు ఉచితంగా వైద్య సలహాలు, 6 నెలలు రాయితీతో కూడిన చికిత్స మరియు మందులు అందజేయనున్నారు.
ప్రివెంటివ్ కేర్, డయాగ్నస్టిక్ సేవలు, ప్రాథమిక ఆరోగ్య సేవలు, చిన్నపాటి జబ్బులకు చికిత్స, ప్రొఫెషనల్ కన్సల్టేషన్, రిఫరల్ సేవలు, సరసమైన ధరలకే మందులతో పాటు డిజిటల్ హెల్త్ రికార్డ్ సౌకర్యాలు ఈ కేంద్రాల్లో లభించనున్నాయి. ఇందులో భాగంగా మొదటి ఆరోగ్య కేంద్రం 'రమేష్ & బేలా అగర్వాల్ హెల్త్‌కేర్ సెంటర్'ను రితేష్ స్వస్థలం రాయగడలో ప్రారంభించారు. ఒడిశా ఎస్సీ & ఎస్టీ మరియు మైనార్టీల సంక్షేమ శాఖ మంత్రి జగన్నాథ్ సరాకా చేతుల మీదుగా లాంచ్ చేశారు.


Click it and Unblock the Notifications