త్వరలో చమురు ధరలు పెరగనున్నాయా? అంటే అవుననే అంటున్నారు. ఫైనాన్స్ బిల్లు సవరణల్లో భాగంగా ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలపై ఎక్సైజ్ డ్యూటీ పరిమితిని పెంచనుంది. పెట్రోల్‌పై రూ.10 నుండి రూ.18, డీజిల్‌పై రూ.4 నుండి రూ.12కు పెరిగే అవకాశాలు ఉన్నాయి. దీనికి ఉభయ సభల్లో ఆమోదం లభిస్తే ధరలు పెరగవచ్చు.
ఫైనాన్స్ బిల్లు 2020కు లోకసభ సోమవారం ఆమోదం తెలిపింది. ఎలాంటి చర్చ లేకుండా వాయిస్ ఓటు ద్వారా ఆమోదం తెలిపింది. ప్రపంచాన్ని, దేశాన్ని కరోనా మహమ్మారి గడగడలాడిస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చర్చ లేకుండా ఆమోదం లభించింది.

ఈ బిల్లు 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వ ప్రభుత్వ ఆర్థిక ప్రతిపాదనలను అమలు చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం వచ్చే ఆర్థిక సంవత్సరానికి గాను రూ.30,42,230 కోట్లు ఖర్చు చేయనుంది. 2019-20లో సవరించిన అంచనా కంటే ఇది 12.7 శాతం అధికం.
పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా 16.3 శాతం నిధులు పెరిగి రూ.22,45,893కు చేరుకుంటాయని అంచనా. అలాగే నామినల్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్స్ గ్రోత్ రేట్ 10 శాతంగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. 2019-20 నామినల్ గ్రోత్ 12 శాతంగా అంచనా వేసింది.
More From GoodReturns

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..సిల్వర్ కొనుగోలుపై నిపుణులు కీలక సూచన..



Click it and Unblock the Notifications