ఇండోర్: గత అయిదేళ్లలో 26 పబ్లిక్ సెక్టార్ బ్యాంకులకు చెందిన 3,400కు పైగా శాఖలు విలీనం లేదా మూసివేతకు గురయ్యాయి. ఈ మేరకు సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సమాధానం చెప్పింది. ఇందులో 75 శాతం శాఖలు అంటే 2,568 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) గ్రూప్‌కు చెందినవి అని పేర్కొంది. వివిధ బ్యాంకులకు సంబంధించి 2014-15లో 90, 2015-16లో 126, 2016-17లో 253, 2017-18లో 2,083, 2018-19లో 875 ఆయా బ్యాంకుల బ్రాంచీలు విలీనం కావడం లేదా మూసివేయడం జరిగింది. ఇది ఎక్కువగా పెద్ద సిటీల్లోనే జరిగింది.

ఈ బ్యాంకులు విలీనం...
భారతీయ మహిళా బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పటియాలా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్‌కోర్‌లు ఏప్రిల్ 1, 2017లో ప్రభుత్వరంగ అతిపెద్ద బ్యాంక్ SBIలో విలీనం అయినట్లు సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నకు... ఆర్బీఐ తెలిపింది. గత ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి విజయా బ్యాంక్, దేనా బ్యాంక్‌లు బ్యాంక్ ఆఫ్ బరోడాలో విలీనమైనట్లు తెలిపింది. నీముచ్‌కు చెందిన ఆర్టీఐ యాక్టివిస్ట్ చంద్రశేఖర్‌గౌడ్ సమాచార హక్కు చట్టం కింద వివరాలు కోరారు.

మరిన్ని బ్యాంకుల విలీనం...
ఇటీవల 10 బ్యాంకులను నాలుగుగా మెగా మెర్జర్ చేస్తోన్న విషయం తెలిసిందే.
ఈ ప్రక్రియ నడుస్తోంది. ఇలాంటి సమయంలో ఆర్బీఐ సమాధానం వచ్చింది. తాజా బ్యాంకుల విలీనాన్ని ఉద్యోగ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ బ్యాంకుల విలీన ప్రక్రియ పూర్తయితే దేశవ్యాప్తంగా మూతబడే బ్యాంకులు 7,000కు చేరుకుంటాయని ఆలిండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (AIBEA) జనరల్ సెక్రటరీ సీహెచ్ వెంకటాచలం ఆందోళన వ్యక్తం చేశారు. ఆయా బ్యాంకుల బిజినెస్ దెబ్బతింటుందన్నారు.

సిటీలు, మెట్రోలపై ఎక్కువ ప్రభావం
10 బ్యాంకులు నాలుగు మెగా బ్యాంకులుగా విలీనమైన తర్వాత ఎక్కువ ప్రభావం మెట్రో నగరాలు, సిటీల పైనే పడుతుందని చెబుతున్నారు. కాగా, పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనమవుతున్నాయి. కెనరా బ్యాంక్‌లో సిండికేట్ బ్యాంక్, అలాగే ఇండియన్ బ్యాంక్‌లో అలహాబాద్ బ్యాంక్ కలుస్తుండగా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్స్ విలీనం అవుతున్నాయి. ఈ ప్రక్రియ నడుస్తోంది.

చిన్న బ్యాంకులు పెద్దగా మారితే ఎన్నో ప్రయోజనాలు..
అదే సమయంలో బ్యాంకుల విలీనం సరైనదేనని ఆర్థికనిపుణులు జయంతిలాల్ భండారి అంటున్నారు. చిన్న చిన్న ప్రభుత్వ బ్యాంకుల విలీనం వల్ల బ్యాంకుల పరిధి విస్తరిస్తుందని అది ప్రయోజనమేనని అంటున్నారు. భారీ బ్యాంకుల ఏర్పాటుతో ప్రభుత్వానికి లాభం చేకూరుతుందన్నారు. ప్రస్తుతం చిన్నతరహా బ్యాంకుల అవసరం లేదన్నారు. పెద్ద బ్యాంకులు అందుబాటులోకి వస్తే వాటి ఆర్థిక సామర్థ్యం పెరిగి సామాన్యులకు మరిన్ని రుణాలు వచ్చే వీలుందన్నారు. బ్యాంకింగ్ రంగాన్ని, ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉనికిని ప్రశ్నార్థకం చేస్తున్న ఎన్పీఏల సమస్యకు పరిష్కారం లభిస్తుందని కూడా ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం రుణ ఎగవేతదారులు ఒక బ్యాంక్ నుంచి మరో బ్యాంకుకు సులభంగా వెళ్తున్నారు. బ్యాంకులు తగ్గితే ఈ పరిస్థితిలో మార్పు వస్తుందని చెబుతున్నారు. తద్వారా ఎన్పీఏలు కూడా తగ్గుతాయని అంచనా.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: బెంగళూరు వాహనదారులకు అలర్ట్! ఆ రూట్లో ఫ్లైఓవర్ 84 గంటలు బంద్!



Click it and Unblock the Notifications