భారత్‌లో ఎనిమిది ప్రధాన పరిశ్రమలు నవంబర్ నెలలోను ఉత్పత్తి తగ్గుదలను రిపోర్ట్ చేశాయి. ఇది వరుసగా నాలుగో నెల కావడం గమనార్హం. ముడి చమురు, బొగ్గు ఉత్పత్తి, సహజవాయువు తదితర రంగాలు 40.27 శాతం ఉంటాయి. ఈ ఎనిమిది రంగాల్లో ఉత్పత్తి తగ్గుదల 1.5 శాతం ఉన్నట్లు ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇండెక్స్ (IIP) రిపోర్ట్ చెబుతోంది. 8 కోర్ పరిశ్రమల సంయుక్త సూచీ నవంబర్ నెలలో 126.3గా ఉంది. 2018తో పోలిస్తే ఇది 1.5 శాతం తగ్గుదల. 2019-20 ఆర్థిక సంవత్సరం తొలి అర్ధ సంవత్సరంలో అంతకుముందు ఏడాదితో పోలిస్తే స్థిరంగా ఉందని ప్రభుత్వం తెలిపింది.

బొగ్గు
బొగ్గు ఉత్పత్తి (weight: 10.33%) 2018 నవంబర్ నెలతో పోలిస్తే 2019 నవంబర్ నెలలో 2.5 శాతం మేర తగ్గింది. 2019-20లో ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్య దీని క్యుములేటివ్ ఇండెక్స్ అంతకుముందు ఏడాదితో పోలిస్తే 5.3 శాతం తగ్గింది.

క్రూడాయిల్
క్రూడాయిల్ ఉత్పత్తి (weight: 8.98%) 2018 నవంబర్ నెలతో పోలిస్తే 2019 నవంబర్ నెలలో 6 శాతం తగ్గింది. 2019-20లో ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్య దీని క్యుములేటివ్ ఇండెక్స్ అంతకుముందు ఏడాదితో పోలిస్తే 5.9 శాతం తగ్గింది.
క్రూడాయిల్
క్రూడాయిల్ ఉత్పత్తి (weight: 8.98%) 2018 నవంబర్ నెలతో పోలిస్తే 2019 నవంబర్ నెలలో 6 శాతం తగ్గింది. 2019-20లో ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్య దీని క్యుములేటివ్ ఇండెక్స్ అంతకుముందు ఏడాదితో పోలిస్తే 5.9 శాతం తగ్గింది.

నేచరల్ గ్యాస్
నేచరల్ గ్యాస్ ఉత్పత్తి (weight: 6.88%) 2018 నవంబర్ నెలతో పోలిస్తే 2019 నవంబర్ నెలలో 6.4 శాతం తగ్గింది. 2019-20లో ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్య దీని క్యుములేటివ్ ఇండెక్స్ అంతకుముందు ఏడాదితో పోలిస్తే 3.1 శాతం తగ్గింది.

రిఫైనరీ ఉత్పత్తులు
పెట్రోలియం రిఫైనరీ ఉత్పత్తులు (weight: 28.04%) 2018 నవంబర్ నెలతో పోలిస్తే 2019 నవంబర్ నెలలో 3.1 శాతం తగ్గింది. 2019-20లో ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్య దీని క్యుములేటివ్ ఇండెక్స్ అంతకుముందు ఏడాదితో పోలిస్తే 1.1శాతం తగ్గింది.

ఫెర్టిలైజర్స్
ఫెర్టిలైజర్ ఉత్పత్తులు (weight: 2.63%) 2018 నవంబర్ నెలతో పోలిస్తే 2019 నవంబర్ నెలలో 13.6శాతం తగ్గింది. 2019-20లో ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్య దీని క్యుములేటివ్ ఇండెక్స్ అంతకుముందు ఏడాదితో పోలిస్తే 4 శాతం తగ్గింది.

స్టీల్
స్టీల్ ఉత్పత్తులు (weight: 17.92%) 2018 నవంబర్ నెలతో పోలిస్తే 2019 నవంబర్ నెలలో 3.7 శాతం తగ్గింది. 2019-20లో ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్య దీని క్యుములేటివ్ ఇండెక్స్ అంతకుముందు ఏడాదితో పోలిస్తే 5.2 శాతం తగ్గింది.

సిమెంట్
సిమెంట్ ఉత్పత్తులు (weight: 5.37%) 2018 నవంబర్ నెలతో పోలిస్తే 2019 నవంబర్ నెలలో 4.1 శాతం తగ్గింది. 2019-20లో ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్య దీని క్యుములేటివ్ ఇండెక్స్ అంతకుముందు ఏడాదితో పోలిస్తే 0.02 శాతం తగ్గింది.

ఎలక్ట్రిసిటీ
ఎలక్ట్రిసిటీ ఉత్పత్తులు (weight: 5.37%) 2018 నవంబర్ నెలతో పోలిస్తే 2019 నవంబర్ నెలలో 5.7 శాతం తగ్గింది. 2019-20లో ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్య దీని క్యుములేటివ్ ఇండెక్స్ అంతకుముందు ఏడాదితో పోలిస్తే 0.07 శాతం తగ్గింది.


Click it and Unblock the Notifications