పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా ఇండియా పాకిస్తాన్ అలాగే పీఓకే స్థావరాలపై దాడులు చేసింది. అయితే ఈ దాడులు బుధవారం తెల్లవారుజామున జరిగింది. దేశంలోని మూడు సైన్యాలు ఉమ్మడి ఆపరేషన్‌లో భాగంగా మొత్తం 9 ప్రదేశాలపై ఈ దాడి చేశాయి. ఈ ప్రచారానికి ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టారు. భారతదేశం చేసిన ఈ దాడిలో సుమారు 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆపరేషన్ సిందూరుని స్వయంగా పర్యవేక్షించారు కూడా. అయితే ఆపరేషన్ సిందూర్ గురించి కొన్ని వివరాలు చూస్తే...

భారతదేశ ఈ చర్య గురించి సమాచారం నేడు తెల్లవారుజామున బయటకు వచ్చింది. మంగళవారం అర్ధరాత్రి తర్వాత ముజఫరాబాద్ నగరం చుట్టూ ఉన్న పర్వతాల దగ్గర చాల పెద్ద పెద్ద పేలుళ్ల శబ్దాలు వినిపించాయని పలువురు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అంతేకాదు ఈ పేలుళ్ల తర్వాత ఆ నగరంలో విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది. దీని తర్వాత కొద్దిసేపటికే, పాకిస్తాన్ సైన్యం నుండి ఒక ప్రకటన వచ్చింది. భారతదేశ చర్యకు తాము ప్రతిస్పందిస్తానని వెల్లడించింది.
పాకిస్తాన్ డాన్ న్యూస్ నివేదిక ప్రకారం కోట్లి, బహవల్పూర్ ఇంకా ముజఫరాబాద్‌లలో భారతదేశ క్షిపణి దాడులు నిర్వహించిందని ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ISPR) డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి తెలిపారు. ఈ దాడులలో భారత సైన్యం, నావికాదళం అలాగే వైమానిక దళం అనే మూడు దళాలను ఉన్నాయి. ఇందులో ప్రెసిషన్ అటాక్ వెపన్ సిస్టమ్‌లను ఉపయోగించారు.
అమెరికా జాతీయ భద్రతా సలహాదారు అండ్ విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో భారత దాడిపై పాకిస్తాన్ NSA ఇంకా ISI చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ అసిమ్ మాలిక్‌తో మాట్లాడారు. అయితే భారత దాడి తర్వాత పాకిస్తాన్‌కు వెళ్లే చాల విమానాలు రద్దు అయ్యాయి. దాడి చేసిన తొమ్మిది ప్రదేశాలలో నాలుగు పాకిస్తాన్‌లో ఉండగా, ఐదు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఉన్నాయి. పాకిస్తాన్‌లోని స్థావరాలలో బహవల్పూర్, మురిడ్కే ఇంకా సియాల్‌కోట్ ఉన్నాయి.
భారతదేశం - పాకిస్తాన్ మధ్య పరిస్థితిని మేము నిశితంగా పరిశీలిస్తున్నామని అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్క్ రూబియో అన్నారు.
మరోవైపు ఖతార్ ఎయిర్‌వేస్ పాకిస్తాన్‌కు వెళ్లే అన్ని విమానాలను రద్దు చేయగా, పూంచ్-రాజౌరి సెక్టార్‌లోని భింబర్ గాలి ప్రాంతంలో పాకిస్తాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి ఫిరంగి కాల్పులకు తెగబడింది. ఆపరేషన్ సిందూర్‌లో పాల్గొన్న అన్ని భారతీయ పైలట్లు, యుద్ధ విమానాలు దాడులు తరువాత సురక్షితంగా సైనిక స్థావరానికి తిరిగి వచ్చాయి. ఈ దాడుల తరువాత పాకిస్తాన్ వైమానిక ప్రాంతాన్ని మూసివేసినట్లు సమాచారం.


Click it and Unblock the Notifications