ప్రభుత్వ యాజమాన్యంలోని ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పోరేషన్ నష్టాల్లో ఉంది . ఉత్పత్తి వ్యయం కంటే ధర తక్కువగా ఉండటంతో ఓఎన్జీసీ నష్టాలలో ఉంది . అడ్మినిస్ట్రేటెడ్ ప్రైస్ మెకానిజం (ఎపిఎం) కింద ఉత్పత్తి చేయబడిన గ్యాస్ ధర కంపెనీ ఉత్పత్తి వ్యయం కంటే చాలా తక్కువగా ఉన్నందున ఒఎన్‌జిసి తన గ్యాస్ వ్యాపారంలో ఈ సంవత్సరం సుమారు 6,000 -7,000 కోట్ల రూపాయలు నష్టపోతోందని ఓఎన్జీసీ ఫైనాన్స్ డైరెక్టర్ సుభాష్ కుమార్ పేర్కొన్నారు .

ప్రభుత్వం ఆదేశించిన రేట్లు ఒక దశాబ్దం కనిష్టానికి.. వ్యాపారంపై తీవ్ర నష్టం
ఓఎన్జీసీ సహజవాయువు ఉత్పత్తిలో 95 శాతానికి పైగా ప్రభుత్వ అడ్మినిస్ట్రేటెడ్ ప్రైస్ మెకానిజం క్రింద ధర ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఎపిఎం కింద సహజ వాయువు ధరను అక్టోబర్ 1 నుంచి ఆరు నెలల వరకు 2.39 ఎంఎంబిటియు నుండి ఎంఎంబిటియు 1.79 కు తగ్గించింది.ఇంధనం కోసం ప్రభుత్వం ఆదేశించిన రేట్లు ఒక దశాబ్దం కనిష్టానికి పడిపోవడంతో ఓఎన్జీసీ న్యాచురల్ గ్యాస్ వ్యాపారంపై రూ .6,000-7,000 కోట్లు నష్టపోతున్నట్లు భారత అగ్రశ్రేణి చమురు మరియు గ్యాస్ ఉత్పత్తిదారు ఒఎన్‌జిసి తెలిపింది.

6 వేల నుండి 7 వేల కోట్ల రూపాయల నష్టం
ప్రభుత్వం ఆదేశించిన రేట్లు బ్రిటీష్ థర్మల్ యూనిట్‌కు 3.5-3.7 డాలర్ల ఉత్పత్తి వ్యయం కంటే తక్కువగా ఉన్నాయని ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పోరేషన్ డైరెక్టర్ (ఫైనాన్స్) సుభాష్ కుమార్ తెలిపారు.
గ్యాస్ ధరలో ప్రతి డాలర్ తగ్గింపు సుమారు 5,200 కోట్ల రూపాయలు మరియు లాభంపై 3,500 కోట్ల రూపాయల నష్టానికి దారితీస్తుందని చెప్పారు. దాదాపు 6 వేల నుండి 7 వేల కోట్ల రూపాయల నష్టం జరుగుతుందని పేర్కొన్నారు.

అనుబంధ సంస్థల విలీనానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్న ఓఎన్‌జిసి చైర్మన్
ఇదే సమయంలో ప్రభుత్వ యాజమాన్యంలోని ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పోరేషన్ (ఒఎన్‌జిసి) తన రెండు చమురు శుద్ధి అనుబంధ సంస్థలైన హిందూస్తాన్ పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్ (హెచ్‌పిసిఎల్) మరియు మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్ (ఎంఆర్‌పిఎల్) లను 2021 జూన్ తరువాత విలీనం చేసే అవకాశం ఉందని దాని చైర్మన్ శశి శంకర్ తెలిపారు.విలీనం కోసం పెట్రోలియం మంత్రిత్వ శాఖ నుండి అనుమతి లభించిందని జూన్ 2021 నాటికి దీనిని పూర్తి చేయాలని తాము ఆశిస్తున్నామని చైర్మన్ తెలిపారు.
More From GoodReturns

నేస్తం నేనున్నా.. భారత్‌కు అండగా నిలిచిన రష్యా.. చమురు సంక్షోభంపై కీలక ప్రకటన..

విశ్వ విజేతగా భారత్.. కళ్లు చెదిరే నజరానా.. ICC Men's T20 World Cup 2026 ప్రైజ్ మనీ పూర్తి వివరాలు ఇవే..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్‌లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!



Click it and Unblock the Notifications