ఇండియాలోకి సరికొత్త వన్‌ప్లస్ N సిరీస్: జూన్ 30న OnePlus N6 గ్రాండ్ ఎంట్రీ!
భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో వన్‌ప్లస్ (OnePlus) బ్రాండ్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటివరకు ఫ్లాగ్‌షిప్, నోర్డ్ (Nord) సిరీస్‌లతో ప్రీమియం, మిడ్-రేంజ్ విభాగాలను శాసించిన ఈ చైనీస్ దిగ్గజం.. ఇప్పుడు భారతీయ వినియోగదారుల కోసం మరో సరికొత్త సిరీస్‌ను ప్రకటించింది. భారతదేశంలో 'N సిరీస్' (N Series) పేరుతో సరికొత్త మొబైల్స్ లైన్‌అప్‌ను తీసుకువస్తున్నట్లు కంపెనీ అధికారికంగా వెల్లడించింది. ఈ సిరీస్ లో వస్తున్న మొదటి స్మార్ట్‌ఫోన్ 'OnePlus N6' జూన్ 30న మార్కెట్లోకి లాంచ్ కానుంది.

రూ.18,000 నుండి రూ.25,000 బడ్జెట్ మార్కెట్టే టార్గెట్!
భారతదేశంలో స్మార్ట్‌ఫోన్ మార్కెట్ చాలా వేగంగా విస్తరిస్తోంది. ముఖ్యంగా రూ.18,000 నుండి రూ.25,000 ధరల విభాగం అనేది దేశంలోనే అత్యధికంగా ఫోన్లు అమ్ముడయ్యే అతిపెద్ద మార్కెట్. అందుకే వన్‌ప్లస్ ఇప్పుడు ఈ సెగ్మెంట్‌ను టార్గెట్ చేసింది. తక్కువ బడ్జెట్‌లోనే బెస్ట్ పర్ఫార్మెన్స్, ప్రీమియం సాఫ్ట్‌వేర్ ఎక్స్‌పీరియన్స్ ఆశించే యువతను దృష్టిలో ఉంచుకుని ఈ కొత్త వన్ ప్లస్ ఎన్ (Oneplus N) సిరీస్‌ను డిజైన్ చేశారు. ఈ కొత్త ఎంట్రీతో వన్‌ప్లస్ ఇప్పుడు ఇండియాలో మూడు కేటగిరీల్లో (Flagship, Nord, N Series) తన వ్యాపారాన్ని కొనసాగించనుంది.
యువత అవసరాలకు తగ్గట్టుగా..
వన్‌ప్లస్ ఇండియా సీఈఓ రాబిన్ లీయూ ఈ లాంచ్ గురించి మాట్లాడుతూ.. "ప్రస్తుతం ఇండియా స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌కు రూ.18,000-₹25,000 సెగ్మెంట్ ఒక ప్రధాన కేంద్రంగా మారింది. టెక్నాలజీ పరంగా వినియోగదారుల అంచనాలు ఇక్కడే చాలా వేగంగా మారుతున్నాయి" అని పేర్కొన్నారు. నేటి యువత గేమింగ్, ఎంటర్‌టైన్‌మెంట్, ఆన్‌లైన్ లెర్నింగ్, , క్రియేటివిటీ కోసం ఎక్కువగా స్మార్ట్‌ఫోన్‌లపైనే ఆధారపడుతున్నారు. 2025 లో భారతదేశంలో ఏకంగా 152 మిలియన్లకు పైగా స్మార్ట్‌ఫోన్లు అమ్ముడయ్యాయని, మొబైల్ స్క్రీన్ టైమింగ్స్ కూడా విపరీతంగా పెరిగాయని కంపెనీ గుర్తుచేసింది.
జూన్ 30న వస్తున్న OnePlus N6!
ఈ కొత్త సిరీస్ లో రాబోతున్న మొదటి ఫోన్ వన్‌ప్లస్ N6. అయితే, ఈ ఫోన్‌కు సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్స్, ఫీచర్లు, కెమెరా క్వాలిటీ లేదా కచ్చితమైన ధరను కంపెనీ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. లాంచ్ తేదీ దగ్గరపడే కొద్దీ మరిన్ని వివరాలను అనౌన్స్ చేస్తామని తెలిపింది. ఎలాగైనా సరే, ఈ సరికొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ సిరీస్ ద్వారా ఇండియాలోని మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ఉన్న పోటీని మరింత పెంచాలని వన్‌ప్లస్ గట్టి ప్లాన్ వేస్తోంది. ప్రీమియం బ్రాండ్ ఫోన్‌ను తక్కువ ధరలో సొంతం చేసుకోవాలనుకునే వారికి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ కానుంది.
మార్కెట్‌లో పెరగనున్న పోటీ!
వన్‌ప్లస్ సరికొత్త బడ్జెట్ సిరీస్‌తో రంగంలోకి దిగుతుండటంతో.. ప్రస్తుతం ఈ ప్రైస్ సెగ్మెంట్‌లో ఉన్న శామ్‌సంగ్, రియల్‌మీ, వివో, షియోమీ వంటి బ్రాండ్లకు గట్టి పోటీ ఎదురుకానుంది. సాధారణంగా లగ్జరీ, ఫ్లాగ్‌షిప్ ఫోన్లకు కేటాయించే వన్‌ప్లస్ సిగ్నేచర్ ఆక్సిజన్ ఓఎస్ (OxygenOS) సాఫ్ట్‌వేర్ ఎక్స్‌పీరియన్స్, స్మూత్ డిస్‌ప్లే, మరియు ఫాస్ట్ చార్జింగ్ వంటి ఫీచర్లను ఈ తక్కువ ధరలోనే అందిస్తే గనుక, ఈ సిరీస్ సూపర్ హిట్ అవ్వడం ఖాయం. బడ్జెట్ పరిమితుల వల్ల ఇప్పటివరకు వన్‌ప్లస్ డివైజ్‌లను కొనలేకపోయిన సగటు వినియోగదారుడికి, ముఖ్యంగా కాలేజ్ స్టూడెంట్స్ ఉద్యోగులకు ఈ Oneplus N6 ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయంగా మారబోతోంది.


Click it and Unblock the Notifications