ITR Filing: ప్రస్తుతం దేశంలో ఆదాయపు పన్ను రిటర్న్ ఫైలింగ్ సీజన్ నడుస్తోంది. పన్ను పరిధిలోకి వచ్చే అనేక మంది చివరి క్షణాల్లో హడావిడిగా చేసే తప్పులు వారికి చిక్కులను తెచ్చిపెడుతుంటాయి. అయితే ఈ క్రమంలో ఎక్కువ మంది చేసే కొన్ని తప్పుల గురించి ఇప్పుడు తెలుసుకోండి.
ఇటీవల ఆదాయపు పన్ను శాఖ మెుత్తం మూడు రకాల ఐటీఆర్ ఫారమ్‌లను విడుదల చేసింది. అయితే అనేక మంది చేసే సాధారణ తప్పు సరైన ఫారమ్ ఎంచుకోవటంలోనే ఉంటుంది. ITR-1 నుంచి ITR-4 ఫారమ్‌లు సాధారణంగా వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు సంబంధించినవి. అలాగే గడచిన ఆర్థిక సంవత్సరంలో రూ.50 లక్షల కంటే ఎక్కువ జీతం పొందే వ్యక్తులకు ITR-1 వర్తిస్తుంది. తప్పుడు ఐటీఆర్ ఫారమ్ వినియోగిస్తే రిటర్న్ డిఫెక్టివ్ అవుతుంది.

అలాగే అదాయపు పన్ను దాఖలు సమయంలో ఫారమ్-16, ఫారమ్-26AS తప్పక అందుబాటులో ఉంచుకోవాలి. లేకుంటే రిటర్నో అందించిన వివరాల్లో తప్పులుంటే పన్ను అధికారుల నుంచి నోటీసులు వస్తాయి. వీటన్నింటికంటే ముఖ్యమైనది గడువు లోపు రిటర్న్ ఫైల్ చేయటం. ఒకవేళ అలా చేయటంలో విఫలమైతే రూ.1000-5000 వరకు లేట్ ఫైలింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
ఆదాయపుపన్ను రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు తప్పకుండా వడ్డీ ఆదాయాన్ని రిపోర్ట్ చేయాలి. అలాగే ఆర్థిక సంవత్సరంలో ఎవరైనా ఉద్యోగం మారినట్లయితే గతంలో పనిచేసిన కంపెనీ వద్ద పొందిన జీతం కూడా అందించాల్సి ఉంటుంది. అలాగే జాయింట్ రిటర్న్స్ ఫైల్ చేస్తున్నట్లయితే మీ పార్ట్నర్ కి ఆదాయపు పన్ను అధికారుల నుంచి ఏమైనా నోటీసులు వచ్చాయేమో తప్పకుండా గమనించండి.
రిటర్న్ ఫైలింగ్ సమయంలో క్యాపిటల్ గెయిన్స్ నివేదించేటప్పుడు ఎలాంటి తప్పులు లేకుండా చూసుకోవాలి. అలాగే బ్యాంక్ అకౌంట్ వివరాలు అందించే సమయంలో తప్పులు లేకుండా చూసుకోవాలి. చివరగా రిటర్న్ ఫిల్ చేసిన తర్వాత సబ్మిట్ చేసే ముందు అందించిన వివరాలు పూర్తిగా సరిగా ఉన్నాయో లేదో గమనించటం ముఖ్యం. అలాగే ఫైల్ చేసిన రిటర్న్ 120 రోజుల్లోగా వెరిఫై చేసుకోవాలి లేకుంటే రిటర్న్ ఇన్ వ్యాలీడ్ అవుతుంది.


Click it and Unblock the Notifications