For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

COVID 19: ప్రతి ముగ్గురి ప్రొఫెషనల్స్‌లో ఒకరి ఆదాయం తగ్గింది, 6 నెలలు ఇబ్బంది కానీ...

|

కరోనా మహమ్మారి అన్ని రంగాలను తీవ్రంగా దెబ్బతీస్తోంది. కంపెనీలకు ఆదాయం లేదు. కొంతమంది ఉద్యోగాలు పోయాయి. మరికొంతమంది వేతనాల్లో కోత విధించాయి యాజమాన్యాలు. ఎయిర్ లైన్స్, హాస్పిటాలిటీ, టూరిజంపై భారీ ప్రభావం పడింది. రాబోయే ఆరు నెలల కాలంలో ఐటీ, మీడియా, ఉత్పత్తి రంగాల్లో కూడా పరిస్థితులు దారుణంగా ఉంటాయని భావిస్తున్నారు. అయితే దీర్ఘకాలంలో మాత్రం వృద్ధిపై గట్టి విశ్వాసంతో ఉన్నారు.

జాబ్ షాక్: ఏప్రిల్‌లో 62% పడిపోయిన నియామకాలు, ఐటీ సహా ఏ రంగంలో ఎంతంటే?జాబ్ షాక్: ఏప్రిల్‌లో 62% పడిపోయిన నియామకాలు, ఐటీ సహా ఏ రంగంలో ఎంతంటే?

6 నెలలు కష్టం.. 2 ఏళ్లలు జూమ్

6 నెలలు కష్టం.. 2 ఏళ్లలు జూమ్

రాబోయే ఆరు నెలల కాలంలో ఐటీ, మీడియా, మ్యానుఫ్యాక్చరింగ్ రంగాల్లోని యాజమాన్యాలు, ఉద్యోగులు అధ్వాన్న పరిస్థితిని ఎదుర్కొన్నప్పటికీ, ఆ తర్వాత మంచి వృద్ధి నమోదు అవుతుందని భావిస్తున్నారు. రానున్నరెండేళ్లలో తమ కంపెనీలు దూసుకుపోతాయని మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలోని 77 శాతం మంది నిపుణులు, మీడియా రంగంలోని 67 శాతం మంది నిపుణులు, ఐటీ రంగంలోని 65 శాతం నిపుణులు అభిప్రాయపడ్డారు.

ప్రతి ముగ్గురిలో ఒకరి ఆదాయం తగ్గింది

ప్రతి ముగ్గురిలో ఒకరి ఆదాయం తగ్గింది

ఇటీవల లింక్డిన్ చేసిన ఓ సర్వేలో ఇండియాలో ప్రతి ముగ్గురు ఇండియన్ ప్రొఫెషనల్స్‌లో ఒకరి ఆదాయం తగ్గిపోయింది. ఆదాయం తగ్గిన వారిలో సెల్ఫ్ ఎంప్లాయిడ్ ప్రొఫెషనల్స్ ఎక్కువ మంది ఉన్నారని ఈ సర్వేలో వెల్లడైంది. ఇది 62 శాతంగా ఉంది. రాబోయే రెండు వారాల్లో పరిస్థితులు కాస్త అనుకూలంగా ఉంటాయని అభిప్రాయపడింది.

మా కంపెనీల పరిస్థితి బాగుంటుంది

మా కంపెనీల పరిస్థితి బాగుంటుంది

హెల్త్ కేర్, కార్పోరేట్ సేవల పరిశ్రమలోని నిపుణులు (మేనేజ్‌మెంట్ కన్సల్టింగ్, అకౌంటింగ్, మానవవనరులు) మాత్రం తమ తమ కంపెనీల భవిష్యత్తు బాగుంటుందని ఈ సర్వేలో అభిప్రాయపడ్డారు. రానున్న ఆరు నెలల్లో తమ కంపెనీలు పుంజుకుంటాయని 52 శాతం మంది కార్పోరేట్ సర్వీస్ ప్రొఫెషనల్స్, 50 శాతం మంది హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్, 33 శాతం మంది ఎడ్యుకేషన్ ప్రొఫెషనల్స్ చెప్పారు.

English summary

COVID 19: ప్రతి ముగ్గురి ప్రొఫెషనల్స్‌లో ఒకరి ఆదాయం తగ్గింది, 6 నెలలు ఇబ్బంది కానీ... | One in three Indian professionals now have decreased income

Around 1 in 3 Indian professionals now have decreased personal income, according to a new LinkedIn survey.
Story first published: Thursday, May 7, 2020, 15:59 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X