Tax Saving: డిసెంబర్ నెల దగ్గర పడటంతో చాలా మంది ఉద్యోగులు తమ పన్ను ప్రణాళికలపై దృష్టి పెట్టారు. టాక్స్ బ్రాకెట్ కింద వచ్చేవారు డబ్బును ఆదా చేసుకునేందుకు ఉన్న మార్గాలను అన్వేషిస్తున్నారు.
పన్ను ఆదా చేసుకోవాలని భావించే అనేక మందికి కేంద్ర ప్రభుత్వం కొన్ని పథకాలను నిర్వహిస్తోంది. ఆదాయపు పన్ను చట్టంలో అందించిన పలు సెక్షన్ల కింద వీటిలో చేసే ఇన్వెస్ట్మెంట్ పన్ను ప్రయోజనాలను టాక్స్ పేయర్లకు అందిస్తాయి. ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నది మూడు చిన్న పొదుపు పథకాల గురించే.

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్: చిన్న పొదుపు పథకాల్లో ఒకటైన పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(PPF) పన్ను రాయితీల కోసం గుర్తించదగిన వాటిలో ఒకటి. ఇన్కమ్ టాక్స్ చట్టంలోని సెక్షన్-80C కింద రూ.1.5 లక్షలు ఆదా చేయగల పథకం ఇది. ఇందులో ఏడాదికి గరిష్ఠంగా రూ.1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టడం ద్వారా పన్ను మినహాయింపును పొందవచ్చు. వాస్తవానికి PPF అనేది దీర్ఘకాలిక పెట్టుబడి పథకం. ఇందులో కనీసం 15 ఏళ్ల పాటు పెట్టుబడి పెట్టవచ్చు. ఈ స్కీమ్ కింద 7.1 శాతం వడ్డీ లభిస్తోంది. ఎవరైనా కేవలం రూ.500 నుంచి తమ పెట్టుబడిలి ఈ స్కీమ్ కింద ప్రారంభించొచ్చు.

సుకన్య సమృద్ధి యోజన: కేంద్ర ప్రభుత్వం 'బేటీ బచావో.. బేటీ పడావో' స్కీమ్ క్రింద సుకన్య సమృద్ధి పథకాన్ని ప్రారంభించబడింది. దీని కింద ఎవరైనా తమ కుమార్తె పేరుతో పెట్టుబడి పెట్టడం ద్వారా ఏడాదికి రూ.లక్ష వరకు పన్నును ఆదా చేసుకోవచ్చు. స్కీమ్ కింద పెట్టుబడిదారుని కుమార్తెకు 18 సంవత్సరాలు నిండినప్పుడు పెట్టుబడి పెట్టిన మొత్తంలో సగాన్ని, ఆమెకు 21 ఏళ్లు నిండినప్పుడు మొత్తం డబ్బును విత్‌డ్రా చేసుకునేందుకు వీలు కల్పించబడింది. ప్రస్తుతం ఈ స్కీమ్ కింద చేసిన పెట్టుబడులకు 8 శాతం వడ్డీని కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది.

ఉద్యోగుల భవిష్య నిధి: ఎవరైనా తమ పన్ను చెల్లింపును తగ్గించుకోవాలంటే అందుకోసం పరిగణించదగిన పెట్టుబడుల్లో EPF పథకం కూడా ఒకటని చెప్పుకోవచ్చు. ఉద్యోగుల విషయంలో జీతంలో 12 శాతాన్ని పీఎఫ్ ఖాతాలో ప్రతినెల జమ చేయాల్సి ఉంటుంది. ఆదాయపు పన్ను సెక్షన్ 80C కింద రూ. 1.5 లక్షల వరకు మినహాయింపు పొందేందుకు ఈ స్కీమ్ తోడ్పడుతుంది. ప్రస్తుతం ఈ పథకానికి అత్యధికంగా 8.1 శాతం వడ్డీని ప్రభుత్వం చెల్లిస్తోంది. ఈ పథకం ప్రత్యేకంగా పదవీ విరమణ కోసం డబ్బును డిపాజిట్ చేస్తుంది.
More From GoodReturns

March 31: రేపటితో ముగియనున్న ఆర్థిక సంవత్సరం.. ఈ 15 పనులు చేయకపోతే భారీ జరిమానా!

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..



Click it and Unblock the Notifications