గురువారం స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటల 27 నిమిషాలకు బీఎస్ఈ సెన్సెక్స్ 50 పాయింట్లు నష్టపోయి 71,701 వద్ద ట్రేడవుతోంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 7 పాయింట్లు నష్టపోయి 21,718 వద్ద కొనసాగుతోంది. బీఎస్ఈ 30 ఇండెక్స్ లో మారుతీ, పవర్ గ్రిడ్, ఎంఅండ్ఎం, ఎన్టీపీసీ, టాటా మోటర్స్, ఐటీసీ, టీసీఎస్, టాటా స్టీల్, ఇండస్ ఇండ్ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, ఇన్ఫోసిస్, హెచ్ సీఎల్ టెక్, రిలయన్స్, హిందుస్థాన్ యూనిలివర్, సన్ ఫార్మా, హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ లాభాల్లో కొనసాగుతోన్నాయి.
నెస్లే ఇండియా, ఏసియన్ పెయింట్స్, కొటాక్ మహీంద్రా బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, భారతీ ఎయిర్ టెల్, టైటాన్, జేఎస్ డబ్ల్యూ స్టీల్, ఐసీఐసీఐ బ్యాంక్, విప్రో, ఎల్అండ్ టీ నష్టాల్లో కొనసాగుతోన్నాయి. కాసేపట్లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో స్టాక్ మార్కెట్ల పని తీరు ఉండే అవకాశం ఉంది. మరోవైపు పేటీఎం షేర్లు గురువారం భారీగా పడిపోయాయి. గురువారం పేటీఎం షేర్ ప్రైస్ దాదాపు 20 శాతం పడిపోయింది.

రూ.152 పడిపోయి రూ.609 వద్ద ట్రేడవుతోంది. మార్చి 1, 2024 నుంచి పేటీఎం డిపాజిట్లు స్వీకరించవద్దని ఆర్బీఐ ఆదేశించింది. దీంతో పేటీం షేర్లు భారీగా పడిపోయాయి. పేటిఎం ఐపీగా వచ్చిన నుంచి పెట్టుబడిదారులకు భారీ నష్టాలను మిగిల్చింది.
ఈ షేరు ఇప్పటికీ ఐపీఓ ప్రైస్ కంటే డిస్కౌంట్ లోనే ట్రేడవుతోంది. తాజాగా ఆర్బీఐ నిర్ణయంతో పేటీఎం షేర్లు భారీ కుదుపునకు లోనయ్యాయి. ఆర్బీఐ నిర్ణయం నేపథ్యంలో ఫిన్‌టెక్ కంపెనీకి చెందిన పేటీఎం కార్డ్ మెషిన్ వంటి ఆఫ్‌లైన్ వ్యాపారి చెల్లింపు నెట్‌వర్క్, పేటీఎం QR, సేవలు కొనసాగనున్నాయి.


Click it and Unblock the Notifications