Paytm: మరోసారి పడిపోయిన పేటీఎం స్టాక్.. ఇక కోలుకోవడం కష్టమేనా.. !
పేటీఎం(Paytm) మాతృ సంస్థ అయిన One97 కమ్యూనికేషన్స్ స్టాక్ ధర గత రెండు ట్రేడింగ్ రోజులలో భారీ నష్టాల నుంచి కొద్దిగా కోలుకుంది. గురువారం ట్రేడింగ్ సెషన్‌లో పేటీఎం స్టాక్ భారీగా పడిపోయింది. బుధవారంరూ.496.25 ముగిసింది. గురువారం రూ525 వద్ద ప్రారంభమైంది. అయినప్పటికీ స్టాక్ ఊపును కొనసాగించలేకపోయింది. ప్రారంభ ట్రేడింగ్‌లో ఒక్కో షేరుకు రూ.450కి తగ్గింది. 9.2 శాతం పడిపోయింది.
పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ ఆర్థిక శాఖ మంత్రి సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలోనే స్టాక్ లో పెరుగుదల కనిపించింది. అయితే సమావేశానికి సంబంధించి ఎలాంటి వివరాలు బయటకు రాలేదు. దీంతో స్టాక్ ఈ రోజు మరోసారి పడిపోయింది. ఫిబ్రవరి 6 మరియు 7 తేదీల్లో స్వల్పంగా కోలుకుంది. స్టాక్ దాదాపు 13% ర్యాలీ అయింది. కానీ ఆ లాభాలను కొనసాగించడంలో విఫలమైంది. పేటీఎం ఈకేవైసీ నిబంధనలు సరిగా పాటించలేదని ఆర్బీఐ కఠిన నిర్ణయాలు తీసుకుంది.

దీంతో ఫిబ్రవరి 29 తర్వాత పలు సేవలను నిలిపివేయాలని ఆర్బీఐ ఆదేశించింది. దీంతో పేటీఎం స్టాక్ భారీగా పడిపోయింది. పేటీఎంవ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న చెల్లింపు బ్యాంకు ప్రస్తుతం 330 మిలియన్లకు పైగా వాలెట్ ఖాతాలను కలిగి ఉన్నందున, RBI పరిమితులు కంపెనీకి పెద్ద దెబ్బగా చెప్పొచ్చు. ఫిబ్రవరి 1న ఆర్‌బీఐ తీసుకున్న నిర్ణయంతో తర్వాతి రెండు ట్రేడింగ్ రోజుల్లో పేటీఎం స్టాక్ 20% క్షీణించింది. ఫలితంగా,స్టాక్ ఎక్స్ఛేంజీలు సర్క్యూట్ పరిమితిని 10%కి తగ్గించాయి. ఈ తగ్గుదల ట్రెండ్ సోమవారం కూడా కొనసాగింది.
సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై పేటీఎం యాజమాన్యం స్పందించింది. నిరాధారమైన ఊహాగానాలుగా పేర్కొంటూ తీవ్రంగా ఖండించింది. పేటీఎం లేదా దాని అనుబంధ సంస్థ Paytm Payments Bank Limited (PPBL) ద్వారా విదేశీ మారకపు నిబంధనలను ఉల్లంఘించినట్లు దర్యాప్తును సూచించే నివేదికలలో వాస్తవ ఆధారం లేదని కంపెనీ స్పష్టం చేసింది. KYC మార్గదర్శకాలను పాటించకపోవడం, ఇతర సమస్యలను పేర్కొంటూ RBI Paytm పేమెంట్ బ్యాంక్ కార్యకలాపాలపై తీవ్ర ఆంక్షలు విధించింది. RBI నియంత్రణలు వారి వాలెట్లు, ఫాస్ట్‌ట్యాగ్‌లు, NCMC ఖాతాలు, సేవింగ్స్ ఖాతాలలోని వినియోగదారు డిపాజిట్లపై ప్రభావం చూపవని Paytm తెలియజేసింది.


Click it and Unblock the Notifications