AP: ఏపీకి పెట్టుబడుల వెల్లువ.. తొలి రోజే రూ.1,57,607 కోట్ల పెట్టుబడులు..!

విశాఖపట్నం వేదికగా జరుగుతున్న సీఐఐ 31వ భాగస్వామ్య సదస్సులో ఏపీకి పెట్టుబడులు వెల్లువ కొనసాగుతున్నాయి. సదస్సు తొలిరోజే రాష్ట్రానికి భారీ పెట్టుబడుల ప్రకటనలు వచ్చాయి. మంత్రి నారా లోకేశ్ సమక్షంలో పారిశ్రామికవేత్తలు ఏపీ ప్రభుత్వంతో భారీగా అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు వెల్లడించారు. మొత్తం రూ.1,57,607 కోట్ల విలువైన 35 ఒప్పందాలు జరిగాయని అధికారులు ప్రకటించారు. వీటి ద్వారా రాష్ట్రంలో 52,956 మందికి ఉద్యోగావకాశాలు లభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 30 ఎంఓయూలు, 5 జీఓల ద్వారా ఈ పెట్టుబడులు వస్తాయని అధికారులు పేర్కొన్నారు. దీంతో రాష్ట్ర పారిశ్రామిక రంగం కొత్త పుంతలు తొక్కనుంది.

ఈ సదస్సులో రెన్యువబుల్ ఎనర్జీ, మౌలిక సదుపాయాలు, ఏరోస్పేస్, హెల్త్‌కేర్, పర్యాటక రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు సంస్థలు ముందుకు వచ్చాయి. మెగా ఇంజనీరింగ్ సంస్థ మూడు ఎంఓయూల ద్వారా ఏకంగా రూ.39,400 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది. ఈ సంస్థ పెట్టుబడులతో 12,940 ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. రష్మీ మెటలర్జికల్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.18,500 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. క్లీన్ మ్యాక్స్ ఎనర్జీ సొల్యూషన్స్ లిమిటెడ్ పునరుత్పాదక ఇంధన రంగంలో రూ.41 వేల కోట్లు పెట్టుబడి పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. యునైటెడ్ టెలికం లిమిటెడ్ సైతం రూ.9,053 కోట్ల పెట్టుబడికి ఒకే చెప్పింది.

AP investments

రెన్యూ ఫోటోవోల్టాయిక్స్ - రూ.8,500 కోట్లు పెట్టుబడికి ముందుకొచ్చింది. దీంతో 800 ఉద్యోగాలు రానున్నాయి. రెన్యూ ప్రైవేట్ లిమిటెడ్ రూ.42 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ఒప్పందం చేసుకుంది. దీంతో 1,500 ఉద్యోగాలు రానున్నాయి. N.A.N మాగ్నెటెక్ - 3,000 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. దీంతో 1,000 ఉద్యోగాలు రానున్నాయి. N.A.N సెలాక్స్ గ్రీన్‌మెట్ రూ.1,800 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ఒప్పందం చేసుకుంది. ఈ పెట్టుబడితో 1,000 ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. వెల్సపన్ గ్రూప్ రూ.2,500 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. దీంతో 3,500 మందికి ఉపాధి లభించనుంది.

ఎవర్‌వోల్ట్ సోలార్ టెక్నాలజీ రూ.2,350 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ఒప్పందం చేసుకుంది. దీంతో 1,200 ఉద్యోగాలు రానున్నాయి. హీరో మోటర్ కార్ప్ రూ.1,457 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. దీంతో 1,000 ఉద్యోగాలు రానున్నాయి. తొలిరోజే ఈ స్థాయిలో పెట్టుబడుల ఒప్పందాలు కుదరడంతో రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి, ఉపాధి అవకాశాలు భారీగా పెరిగే అవకాశం ఉంది. రానున్న రోజుల్లో మరిన్ని సంస్థలు పెట్టుబడులకు ముందుకొస్తాయని అధికారులు చెబుతున్నారు.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+