Stock Market: లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. ఎస్బీఐ షేర్లు జంప్..
సోమవారం స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 234.79 పాయింట్లు పెరిగి 61,185.15 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 85 పాయింట్లు వృద్ధి చెంది 18,202 వద్ద ముగిసింది. ఎస్బీఐ షేర్లు 3.34 శాతం పెరిగాయి. ఒక్కో షేరు రూ. 613 వద్ద ముగిసింది. బ్యాంక్ శనివారం విడుదల చేసిన తన సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాలు ఊహించని అందరి అంచనాలను మించటంతో ఇన్వెస్టర్లు ఎక్కువగా షేర్లను కొనుగోలు చేసేందుకు మక్కువ చూపారు. దీంతో షేర్లు పెరిగాయి. భారీగా SBI ఆదాయం పెరుగుదలతో.. ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్‌ను వెనక్కి నెట్టింది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
సెప్టెంబర్‌తో ముగిసిన రెండవ త్రైమాసికంలో రిలయన్స్ లాభం రూ.13,656 కోట్లుగా నమోదైంది. అయితే ఇదే కాలానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నికర లాభం ఏకంగా రూ.14,752 కోట్లకు చేరుకుంది. రిలయన్స్ రూ.4,039 కోట్లు ఊహించని టాక్స్ చెల్లించాల్సి రావటంతో SBI ముందుకు వెళ్లింది. టాటా స్టీల్, ఐసీఐసీఐ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, మారుతీ, ఎం&ఎం, హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్, పవర్ గ్రిడ్, హెచ్ డీఎఫ్ సీ, నెస్లే ఇండియా, భారతి ఎయిర్ టెల్, యాక్సిస్ బ్యాంక్, టీసీఎస్, రియన్స్, హిందుస్థాన్ యూనిలివర్, హెచ్ సీఎల్ టెక్, విప్రో, ఎల్&టీ లాభాల్లో ముగిశాయి.

మిడ్ క్యాప్ ఇండెక్స్
టెక్ మహీంద్రా, ఐటీసీ, బజాజ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్, ఎన్టీపీసీ, ఇండస్ ఇండ్ బ్యాంక్, డా.రెడ్డీస్, కొటక్ మంహీంద్రా బ్యాంక్, టైటాన్, సన్ ఫార్మా, బజాజ్ ఫిన్ సర్వ్, ఏసియన్ పేయింట్స్ నష్టాల్లో ముగిశాయి. మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.69 శాతం పెరిగింది. స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.64 శాతం పెరిగింది. బ్యాంక్ నిఫ్టీ 1.04 శాతం పెరిగింది.


Click it and Unblock the Notifications