సోమవారం స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటల 18 నిమిషాలకు బీఎస్ఈ సెన్సెక్స్ 162 పాయింట్లు లాభపడి 65,443 వద్ద కొనసాగుతోంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 55 పాయింట్ల వృద్ధి చెంది 19,381 వద్ద ట్రేడవుతోంది. బీఎస్ఈ 30 ఇండెక్స్ లో రిలయన్స్, టాటా మోటర్స్, టాటా స్టీల్ హెచ్ డీఎఫ్ సీ, ఎల్అండ్టీ, అల్ట్రాటెక్ సిమెంట్, హెచ్ డిఎఫ్ సీ బ్యాంకు, ఏసియన్ పెయింట్స్, మారుతి, ఇండస్ ఇండ్ బ్యాంకు, యాక్సిస్, ఎస్బీఐ, ఐసీఐసీఐ లాభాల్లో ట్రేడవుతున్నాయి.
సన్ ఫార్మా, భారతీ ఎయిర్ టెల్, ఎంఅండ్ఎం, ఐటీసీ, ఎన్టీపీ, బజాజ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్, బజాజ్ ఫిన్ సర్వ్, కొటాక్ బ్యాంకు, హిందుస్థాన్ యూనిలివర్, నెస్లే ఇండియా, విప్రో, టెక్ మహీంద్రా, టీసీఎస్, టైటాన్, పవర్ గ్రిడ్, హెచ్ సీఎల్ టెక్ నష్టాల్లో కొనసాగుతోన్నాయి.

రిలయన్స్ ఇండస్ట్రీస్ రిలయన్స్ రిటైల్ డైరెక్టర్ల బోర్డు తన ప్రమోటర్, హోల్డింగ్ కంపెనీ అయిన రిలయన్స్ రిటైల్ వెంచర్స్ కాకుండా ఇతర వాటాదారుల వద్ద ఈక్విటీ షేర్ క్యాపిటల్‌ను తగ్గించడానికి ఆమోదించింది. రిలయన్స్ స్ట్రాటజిక్ ఇన్వెస్ట్‌మెంట్స్ (ఆర్‌ఎస్‌ఐఎల్) షేర్లను స్వీకరించడానికి అర్హులైన ఈక్విటీ షేర్‌హోల్డర్‌లను నిర్ణయించే ఉద్దేశ్యంతో RIL జూలై 20ని రికార్డ్ డేట్‌గా నిర్ణయించింది.
సోమవారం cyient DLM స్టాక్ లిస్ట్ కానుంది. ఎలక్ట్రానిక్స్ తయారీ సేవలు, సొల్యూషన్స్ ప్రొవైడర్ Cyient DLM జూలై 10న ఇష్యూ ధర రూ. 265 ఇష్యూ ధరపై కనీసం 40 శాతం ప్రీమియంతో ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. బలమైన IPO సబ్‌స్క్రిప్షన్ నంబర్‌లు, బలమైన ఆర్డర్‌బుక్, క్లయింట్ బేస్‌తో కూడిన ఆరోగ్యకరమైన ఫండమెంటల్స్ తో కంపెనీ ఉంది. శుక్రవారం ఐడియా ఫ్రోజ్ బంపర్ లిస్టింగ్ అయింది.


Click it and Unblock the Notifications