తమిళనాడులో ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహనాల కర్మాగారాన్ని ఏర్పాటు చేయనున్నట్టు ఓలా ప్రకటించింది . 2,400 కోట్ల రూపాయల విలువైన తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ ఫ్యాక్టరీని రాష్ట్రంలో ఏర్పాటు చేయడానికి తమిళనాడు ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఓలా సోమవారం తెలిపింది. ఇది భారతదేశ భవిష్యత్ వాహన అవసరాలను తీరుస్తుందని పేర్కొంది.

స్థానిక తయారీ, స్థానికులకు ఉద్యోగాలు , దేశ అవసరాలు తీర్చే ప్లాంట్
ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి అనుగుణంగా, ఓలా కర్మాగారం ఆత్మ నిర్భర్ భారత్ తయారీలో ఒక ముఖ్యమైన దశ అని పేర్కొంది. ఇది ఎలక్ట్రిక్ వాహనాలు తయారీ వంటి కీలకమైన భవిష్యత్ అవసరాలను తీరుస్తుంది అని, వాహన తయారీ రంగంలో భారతదేశం ఇతర దేశాల నుండి దిగుమతుల కోసం ఆధారపడటాన్ని తగ్గిస్తుందని సంస్థ పేర్కొంది.స్థానిక తయారీని పెంచుతుందని, స్థానికులకు ఉద్యోగాలు సృష్టిస్తుందని దేశంలో సాంకేతిక నైపుణ్యాన్ని మెరుగుపరుస్తుంది అని ఓలా రైడ్-హెయిలింగ్ ప్లాట్‌ఫామ్ విడుదల చేసిన ఒక ప్రకటన తెలిపింది.

ప్రపంచంలోనే అతిపెద్ద స్కూటర్ తయారీ కేంద్రంగా
దేశంలో మొట్టమొదటిగా ఏర్పాటవుతున్న ఎలక్ట్రిక్ వాహనాల తయారీ ఫ్యాక్టరీ ద్వారా దాదాపు 10,000 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. ఈ పరిశ్రమ పూర్తయిన తర్వాత ప్రపంచంలోనే అతిపెద్ద స్కూటర్ తయారీ కేంద్రంగా ఉంటుందని వార్తా సంస్థ పిటిఐ నివేదించింది. ఇండియాలో నెలకొల్పుతున్న ఈ పరిశ్రమ ప్రారంభంలో 2 మిలియన్ యూనిట్ల వార్షిక సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.
కొత్త తయారీ కర్మాగారం వచ్చే సంవత్సరంలో తన కార్యకలాపాలను ప్రారంభించనుంది.

ప్రపంచం దృష్టిని ఆకర్షించేలా అత్యంత అధునాతన ఉత్పాదక సదుపాయాలు
ఎలక్ట్రిక్ వెహికల్ (ఇ.వి) లను తయారు చేయడానికి భారతదేశం ప్రపంచ కేంద్రంగా నిలిచిందని ఓలా చెప్పారు. ఈ ఫ్యాక్టరీ ప్రపంచంలోనే అత్యంత అధునాతన ఉత్పాదక సదుపాయాలలో ఒకటిగా ఉంటుందని ఓలా చైర్మన్, గ్రూప్ సిఇఓ భవీష్ అగర్వాల్ తెలిపారు.యూరప్, ఆసియా మరియు లాటిన్ అమెరికాతో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మార్కెట్లలోని వినియోగదారులకు ఈ ప్లాంట్ ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఓలా ఎలక్ట్రిక్ - ఓలా యొక్క ఎలక్ట్రానిక్ వాహనాల తయారీ పరిశ్రమ కోసం - టైగర్ గ్లోబల్, మ్యాట్రిక్స్ ఇండియా, టాటా సన్స్ చైర్మన్ ఎమెరిటస్ రతన్ టాటా మరియు ఇతరుల నుండి సుమారు 400 మిలియన్ డాలర్లు నిధులు సమకూర్చినట్లు పిటిఐ తెలిపింది.


Click it and Unblock the Notifications