Ola Layoff: ఉద్యోగుల తొలగింపుల సెగ ఇప్పుడు ఓలాలోని టెక్కీలకు కూడా చేరింది. ఓలా తన సాఫ్ట్‌వేర్ బృందంలోని కొంతమంది సిబ్బందికి పింక్ స్లిప్‌లను పంపడం ప్రారంభించింది. పింక్ స్లిప్ అంటే అది పొందిన వారు ఇకపై కంపెనీకి అవసరం లేదని అర్థం.

సాఫ్ట్‌వేర్ విభాగం నుంచి..
Ola సంస్థ ANI టెక్నాలజీస్ వివిధ సాఫ్ట్‌వేర్ వర్టికల్స్ నుంచి కనీసం 500 మంది సిబ్బందిని తొలగించవచ్చని తెలుస్తోంది. కంపెనీ నుంచి గెంటేసేందుకు సిద్ధమవుతున్న వారిలో ఎక్కువ మంది ఓలా యాప్‌తో అనుబంధం ఉన్నవారే. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాలు పడిపోతున్న తరుణంలో ఓలాలో ఐటీ నిపుణులను తొలగించాలనే నిర్ణయం వచ్చింది. విక్రయాలు తగ్గుముఖం పట్టడంతో ఆన్‌లైన్‌లో మాత్రమే విక్రయించాలనే వ్యూహాన్ని ఓలా ఎలక్ట్రిక్ మార్చుకుంది.

రికార్డు స్థాయిలో పడిపోయిన అమ్మకాలు..
ఓలా ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్లో దాదాపు తొమ్మిది నెలలుగా ఉంది. కానీ ఇప్పుడు సాఫ్ట్‌వేర్, బ్యాటరీ పనితీరు, సేవలకు సంబంధించి కస్టమర్ ఫిర్యాదులు కంపెనీ పేరును మసకబారుస్తున్నాయి. ఏప్రిల్‌లో కంపెనీ 12,691 స్కూటర్లను విక్రయించింది. అయితే.. ఆగస్టులో 3351 వాహనాల కంటే కొంచెం ఎక్కువగా విక్రయించింది. ఇది గత ఆరునెలల కాలంలో అత్యంత కనిష్ఠ సంఖ్య.

తొలగింపుపై కంపెనీ ఏమంటోందంటే..?
ఎంత మంది సిబ్బందిని బయటకు పంపుతారనేదానిపై స్పందించటానికి ఓలా ప్రతినిధి నిరాకరించారు. దేశంలోని అతిపెద్ద EV కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ ఇప్పుడు సాఫ్ట్‌వేర్ కాకుండా ఇతర రంగాలపై తన దృష్టిని పెంచుతుందని కంపెనీ తన ప్రకటనలో తెలిపింది. వాహనాలు, సెల్‌లు, బ్యాటరీలు, తయారీ, ఆటోమేషన్, అటానమస్ ఇంజనీరింగ్ స్ట్రీమ్‌లలో R&D సామర్థ్యం, ఇంజనీరింగ్‌ను నిర్మించడంపై దృష్టి సారిస్తుంది.

ఇప్పటికే 2,000 మంది తొలగింపు..
ప్రీ-ఓన్డ్ కార్ల వ్యాపారం ఓలా కార్లు, ఓలా డాష్‌ను మూసివేయడం వల్ల ఓలా ఇటీవల దాదాపు 2,000 మంది ఉద్యోగులను తొలగించింది. ఓలా సహ వ్యవస్థాపకుడు భవిష్ అగర్వాల్ నాయకత్వ బృందం సభ్యులతో సహా 30 మంది సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు గత రెండేళ్లలో కంపెనీని వీడారు. ప్రస్తుతం ఓలాలో దాదాపు 2,000 మంది ఇంజనీర్లు పనిచేస్తున్నారని, ఏడాదిన్నర కాలంలో దీనిని 5000కు పెంచాలని కంపెనీ యోచిస్తోంది.


Click it and Unblock the Notifications