Ola IPO: 2023 చివర్లో ఓలా ఐపీఓ..! త్వరలో పెట్టుబడిదారులతో సమావేశం..
ఈ సంవత్సరం చివరిలో ఓలా ఐపీఓ వచ్చే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి Ola Electric పెట్టుబడిదారుల సమావేశాన్ని వచ్చే వారం నిర్వహించనుంది. భారతీయ ఇ-స్కూటర్ తయారీదారు సింగపూర్, USAలోని పెట్టుబడిదారులతో $1 బిలియన్ల IPO కోసం చర్చలు జరిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆగస్టు నాటికి కంపెనీ IPO కోసం రెగ్యులేటరీ పత్రాలను దాఖలు చేయాలని భావిస్తోంది.
Ola 2023 చివరిలో ప్రారంభ పబ్లిక్ ఆఫర్ (IPO) ద్వారా $600 మిలియన్ నుంచి $1 బిలియన్ల మధ్య సమీకరించాలని యోచిస్తోందని రాయిటర్స్ నివేదించింది. ప్రస్తుతం ఈ కంపెనీలో సాఫ్ట్‌బ్యాంక్, టెమాసెక్ వంటి విదేశీ పెట్టుబడిదారులకు వాటాలు ఉన్నాయి. రాబోయే రెండు వారాల్లో, ఓలా వ్యవస్థాపకుడు భవిష్ అగర్వాల్ సింగపూర్, యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్‌డమ్‌లకు వెళ్లి పెట్టుబడిదారులను కలవనున్నారు.

ఈ పర్యటనలో, భవిష్ అగర్వాల్ బ్లాక్‌రోస్క్, సింగపూర్ సావరిన్ వెల్త్ ఫండ్ GIC, T రోవ్ ప్రైస్ వంటి మ్యూచువల్ ఫండ్స్ వంటి పెట్టుబడిదారులతో సమావేశమవుతారని రాయిటర్స్‌తో తెలిపింది. ఇటీవల, కంపెనీ IPOలో ప్రధాన మేనేజర్లలో ఒకరిగా బ్యాంక్ ఆఫ్ అమెరికాను కూడా నియమించింది. BoA, Goldman Sachs, Citi తో పాటు స్థానిక కోటక్ బ్యాంక్‌లను కూడా నియమించింది. అయితే బ్యాంక్ ఆఫ్ అమెరికా కూడా Ola IPO ప్లాన్‌లపై ఎలాంటి అధికారిక వ్యాఖ్యలను అందించలేదు.
Ola తన IPOతో మార్కెట్ లీడర్‌గా అవతరించాలని యోచిస్తోంది. నెలకు దాదాపు 30,000 వాహనాలు విక్రయిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది.ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతున్న ఈ-స్కూటర్ తయారీదారు ప్రస్తుతం TVS మోటార్స్, ఏథర్ ఎనర్జీ, హీరో ఎలక్ట్రిక్ వంటి పెద్ద కంపెనీలతో పోటీ పడుతోంది.


Click it and Unblock the Notifications