ఓలా..అదిరిపోలా: ఒక్కరోజులో లక్ష బుకింగ్స్: ఎలక్ట్రిక్ స్కూటర్లకు భలే గిరాకీ

ముంబై: ఆన్‌లైన్ ద్వారా వాహన సేవలను అందజేస్తోన్న ఓలా కంపెనీ దేశీయ మార్కెట్‌లో ప్రవేశపెట్టదలచిన ఎలక్ట్రిక్ స్కూటర్లకు అనూహ్య ఆదరణ లభిస్తోంది. 24 గంటల వ్యవధిలో లక్ష స్కూటర్లు బుక్ అయ్యాయి. దేశంలో అడ్వాన్స్ బుకింగ్‌ను ప్రారంభించిన 24 గంటల వ్యవధిలోనే ఈ ల్యాండ్‌మార్క్‌ను అందుకుందా కంపెనీ. దేశంలో రోజురోజుకూ పెరుగిపోతోన్న పెట్రోల్, డీజిల్ ధరల వల్ల ఎలక్ట్రిక్ వాహనాలకు ఏ స్థాయిలో డిమాండ్ నెలకొని ఉందనే విషయాన్ని ఓలా వాహనాలు స్పష్టం చేసినట్టయిందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తోన్నాయి.

ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌కు దేశంలో క్రమంగా డిమాండ్ పెరుగుతోందనేది బహిరంగ రహస్యం. ఇంధన ధ‌ర‌ల పెరుగుదల దీనికి ఓ ప్రధాన కారణమైంది. ఈ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఆటోమొబైల్ సెక్టార్‌లో ఉన్న టాప్ కంపెనీలన్నీ ఎల‌క్ట్రిక్ వాహనాల తయారీకి ఆసక్తి చూపుతోన్నాయి. బ‌జాజ్‌, ఏథ‌ర్ వంటి కంపెనీల‌ు ఇప్పటికే ఈ సెక్టార్‌లో అడుగు పెట్టేశాయి కూడా. తాజాగా ఓలా ఎంట్రీ ఇచ్చింది. స్కూట‌ర్ బుకింగ్స్‌ను ప్రారంభించిన 24 గంటల్లోనే లక్ష వాహనాలు రిజర్వ్ అయ్యాయి. ఈ పరిణామం థ్రిల్లింగ్‌గా అనిపిస్తోందంటూ ఓలా ఛైర్మన్ అండ్ గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ భావేష్ అగర్వాల్ పేర్కొన్నారు.

 Ola Electric scooter crossed 1 lakh reservations within the 24 hours of opening the bookings

ఓలా ఎలక్ట్రిక్ స్కూట‌ర్ మూడు వేరియంట్ల‌లో మార్కెట్‌లోకి అందుబాటులోకి వచ్చింది. ఒక్కసారి బ్యాట‌రీని చార్జ్ చేస్తే 240 కిలోమీట‌ర్ల దూరం వ‌ర‌కు రాకపోకలు సాగించే వీలుంది. వేగం పెరిగే కొద్దీ ప్రయాణ సమయం తగ్గుతుంటుంది. 499 రూపాయలను చెల్లించి ఓలా స్కూట‌ర్‌ను బుక్ చేసుకోవ‌చ్చు. బుకింగ్ అమౌంట్ నామమాత్రంగా ఉండటం కూడా అడ్వాన్స్ రిజర్వేషన్ భారీగా పెరగడానికి ఓ కారణమైందని మార్కెట్ వర్గాలు చెబుతోన్నాయి. ఈ ఓలా స్కూటర్ ధ‌ర ల‌క్ష రూపాయ‌ల నుంచి లక్షా 20 వేల వరకు ఉండొచ్చు. ఏడు అంగుళాల ట‌చ్ స్క్రీన్ డిస్‌ప్లే, జీపీఎస్ నావిగేష‌న్‌ అందుబాటులో ఉంటుంది. బ్లూటూత్ ద్వారా 4జీ క‌నెక్టివిటీ సౌకర్యం ఉంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+