యాప్ ఆధారిత క్యాబ్ సేవలను అందిస్తున్న ఓలా క్యాబ్స్ త్వరలో తన ఐపీఓగా రానుంది. ఓలా క్యాబ్స్ ఐపీఓ వచ్చే మూడు నెలల్లో వచ్చే తెలుస్తోంది. కంపెనీ ఐపీఓ ద్వారా రూ. 4 వేల కోట్లకు పైగా సేకరించవచ్చని వార్తలు వసస్తున్నాయి. వచ్చే మూడు నెలల్లో ఓలా క్యాబ్స్ ఐపీఓ ద్వారా 500 మిలియన్ డాలర్లు సమీకరించాలని యోచిస్తున్నట్లు రాయిటర్స్ నివేదిక పేర్కొంది. ఓలా క్యాబ్స్ తన ప్రతిపాదిత IPO కోసం సన్నాహాలు ప్రారంభించిందని నివేదిక పేర్కొంది.
ఇందుకోసం ఓలా క్యాబ్స్ మాతృసంస్థ ఏఎన్ఐ టెక్నాలజీస్ వివిధ పెట్టుబడి బ్యాంకులతో చర్చలు జరుపుతోంది. కంపెనీ తన ప్రారంభ పబ్లిక్ ఆఫర్ కోసం లీడ్ బ్యాంకర్‌ను రాబోయే రెండు మూడు వారాల్లో ఖరారు చేయవచ్చు. ఓలాతో చర్చలు జరుపుతున్న బ్యాంకుల్లో.. బ్యాంక్ ఆఫ్ అమెరికా, గోల్డ్‌మన్ సాక్స్, సిటీ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ ఉన్నాయి. సాఫ్ట్‌బ్యాంక్ మద్దతుతో, Ola మూడు నెలల్లోగా మార్కెట్ రెగ్యులేటర్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI)కి IPO ఆమోద పత్రాలను సమర్పించాలని భావిస్తోంది.

క్యాబ్ కంపెనీ ఇదివరకే ఐపీఓ తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేసింది. ఓలా ముందుగా 2021లో ఐపీఓను ప్రారంభించాలని భావించింది. ఆ సమయంలో ఐపీఓ నుంచి రూ.8,300 కోట్లు సమీకరించాలని కంపెనీ ప్లాన్ చేసింది. అయితే, తర్వాత కంపెనీ తన ప్లాన్‌ను రద్దు చేయాల్సి వచ్చింది. పేలవమైన మార్కెట్ సెంటిమెంట్ కారణంగా ఐపీఓ తీసుకురాలేదు. ఓలా క్యాబ్స్ ఐపీఓ ఖరారు అయితే అది గ్రూప్‌లోని మరో కంపెనీ ఐపీఓ కావచ్చు.
ఎలక్ట్రిక్ స్కూటర్లను తయారు చేసే ఓలా ఎలక్ట్రిక్ ఇప్పటికే ఐపీఓను ప్రారంభించేందుకు సిద్ధమైంది. మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీకి ఐపీఓ ముసాయిదాను దాఖలు చేసింది. ఓలా ఎలక్ట్రిక్ డిసెంబర్ 2023లో సెబీకి డ్రాఫ్ట్ దాఖలు చేసింది. ఐపీఓ ద్వారా సుమారు రూ. 7,250 కోట్ల సమీకరించనుంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications