LPG Cylinder Price: శుభవార్త.. గ్యాస్ ధరలు తగ్గించిన చమురు కంపెనీలు.. ఎంతంటే..??
LPG Cylinder Price: ప్రతినెల మెుదటి రోజున దేశంలోని చమురు కంపెనీలు ఎల్పీజీ సిలిండర్ ధరలను ప్రకటిస్తుంటాయి. ఈ క్రమంలో ధరల్లో మార్పులు చేర్పులు చేస్తుంటాయి. ఈ క్రమంలో నేడు సిలిండర్ ఘరలను తగ్గించాయి.
వివరాల్లోకి వెళితే దేశంలో విక్రయించే 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరలను కంపెనీలు వరుసగా తగ్గిస్తున్నాయి. గత నెలలో అత్యంత స్వల్పంగా రేటును తగ్గించిన కంపెనీలు వాణిజ్య సిలిండర్ల ధరను నేడు రూ.99.75 మేర తగ్గించాయి. దీంతో ఇప్పటికే ధరల భారంతో వ్యాపార నిర్వహణలో ఇబ్బందిపడుతున్న హోటళ్లు, ఇతర వ్యాపారులకు ఇది స్వల్ప ఊరటను అందిస్తుందని తెలుస్తోంది.

ప్రస్తుతం కొత్త ధరలు వచ్చిన తర్వాత కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర వివిధ నగరాల్లో పరిశీలిస్తే.. దిల్లీలో రూ.1,680, ముంబైలో రూ.1,640, కలకత్తాలో రూ.1,802, చెన్నైలో రూ.1,852, హైదరాబాదులో రూ.1,918గా కొనసాగుతున్నాయి. అయితే ఆగస్టు నెలలో సైతం డొమెస్టిక్ వినియోగదారులకు ఎలాంటి ఊరట లభించలేదని చెప్పుకోవాలి. గృహ వినియోగ సిలిండర్ ధర హైదరాబాదులో రూ.1,155గా కొనసాగుతోంది. ఇవి మార్చి నెలలో పెరిగిన తర్వాత ఎలాంటి మార్పులు లేకుండా స్థిరంగా ఉన్నాయి.

LPG గ్యాస్ సిలిండర్లు, ఇంధన ధరలు సాధారణంగా అంతర్జాతీయ ద్రవ్యోల్బణం రేట్లు, ముడి చమురు ధరలపై ఆధారపడి ఉంటాయి. ఇదిలా ఉండగా ఆగస్ట్ 1 నుంచి అమలులోకి వచ్చే ఏవియేషన్ టర్బైన్ ఇంధనం(ATF) ధరలను జూలైలో 8.5 శాతం పెరిగాయి. IOC ప్రతి పదిహేను రోజులకు ATF ధరలను సవరిస్తుంటుంది. ఈ క్రమంలో చాలా మంది మధ్యతరగతి భారతీయ కుటుంబాలు గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ల ధరలను తగ్గించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.


Click it and Unblock the Notifications