LPG Rates: గ్యాస్ సిలిండర్లపై భారీగా ధర తగ్గింపు.. మారిన రేట్ల వివరాలు తెలుసుకోండి..
LPG Rates: దేశంలోని చమురు విక్రయ కంపెనీలు ప్రతినెల మెుదటి తారీఖున గ్యాస్ సిలిండర్ విక్రయ ధరలను నిర్ణయిస్తుంటాయి. ఈ క్రమంలో నేడు కమర్షియల్ గ్యాస్ లిండర్ వినియోగదారులకు అతిపెద్ద ఊరట లభించింది.
దేశంలో విక్రయిస్తున్న 19 కేజీల వాణిజ్య సిలిండర్ల ధర మే 1 నుంచి మారాయి. చమురు కంపెనీలు తాజాగా ఒక్కో సిలిండర్ పై రూ.171.50ను తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. తాజాగా ప్రకటించిన ధరలు మే 1 నుంచి మే 31 వరకు కొనసాగనున్నాయి. ఇప్పటికే ద్రవ్యోల్బణంతో ముడి సరుకు పెరుగుదల, తగ్గుతున్న వ్యాపారాల సమయంలో వాణిజ్య గ్యాస్ వినియోగదారులకు ఇది గొప్ప ఊరటను ఇస్తున్న అంశంగా చెప్పుకోవచ్చు.

దేశంలోని వివిధ నగరాల్లో 19 కేజీల సిలిండర్ల ధరలను గమనిస్తే ముంబైలో ధర రూ1,808.50 ఉండగా.. కోల్‌కత్తాలో రూ.1,960.50గా ఉంది. ఇక చెన్నైలో ధరలను గమనిస్తే రూ.2,021.50గా ఉంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో తాజా ధర రూ.1,856.50గా ఉంది. దీనికి ముందు ఏప్రిల్ 1, 2023న ప్రభుత్వ యాజమాన్యంలోని చమురు కంపెనీలు 19 కేజీల వాణిజ్య సిలిండర్లపై రూ.91.50ను తగ్గించాయి. తాజా తగ్గింపు దీనికి అదనం.
మార్చి నెలలో దేశంలోని చమురు కంపెనీలు కమర్షియల్ సిలిండర్లపై ఏకంగా రూ.350.50ను పెంచగా.. గృహ వినియోగ సిలిండర్లపై రూ.50 మేర ధరలను పెంచాయి. దాదాపు ఏడాదికి పైగా ధరల తగ్గింపు ప్రకటన కోసం ఎదురుచూస్తున్న డొమెస్టిక్ సిలిండర్ వినియోగదారులకు ఎలాంటి ఊరట లభించలేదు. దీంతో ఇప్పటికే అన్ని వస్తువుల ధరలు పెరిగి ఇబ్బంది పడుతున్న సామాన్యులు ధరలను తగ్గించకపోవటంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications