Income Tax: దంచి కొడుతున్న IT శాఖ.. అప్పుడు వందల కోట్లు రికవరీ.. ఇప్పుడు లక్షల కోట్ల బాధ్యత
IT Recovery: గతంలో మాదిరిగా ఆదాయపు పన్ను శాఖ అధికారులు ప్రస్తుతం చూసీచూడనట్టు వ్యవహరించడం లేదు. ఏ చిన్న అవకాశం దొరికినా ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్ను మొత్తాన్ని ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇటీవల దేశవ్యాప్తంగా పలు కంపెనీలపై IT అధికారులు రైడ్స్ చేసిన విషయం తెలిసిందే. వాటిలో ఒడిస్సాలో జరిగిన ఆపరేషన్.. ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద సోదాల్లో ఒకటిగా చెప్పవచ్చు. ఎందుకంటే వందల కోట్లను ఇందులో అధికారులు రికవరీ చేశారు.
పొరుగు రాష్ట్రం ఒడిస్సాకు చెందిన ఓ డిస్టిలరీ గ్రూప్ పై ఆదాయపన్ను శాఖ అధికారులు గతంలో రైడ్ నిర్వహించారు. IT ఇన్వెస్టిగేషన్ ప్రిన్సిపల్ డైరెక్టర్ SK ఝా సహా అదనపు డైరెక్టర్ గురుప్రీత్ సింగ్ ఈ ఆపరేషన్ లీడ్ చేశారు. ఇందులో ఏకంగా 352 కోట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకుగాను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ నుంచి ప్రశంసలతో పాటు జాతీయస్థాయి గుర్తింపు పొందారు. డిసెంబర్ 2023లో మొదలు పెట్టిన ఈ ఆపరేషన్ ఏకంగా 10 రోజులు పాటు కొనసాగింది.

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే భూగర్భంలో దాచిన విలువైన వస్తువులను గుర్తించేందుకు ప్రత్యేక స్కానింగ్ మిషన్ సహా అధునాతన సాంకేతికతను ఈ రైడ్‌లో ఉపయోగించాల్సి వచ్చింది. ఏకకాలంలో గ్రూప్ కి సంబంధించిన పలు ప్రాంగణాల్లో సెర్చ్ ఆపరేషన్ ను ఆదాయపు పన్ను శాఖ నిర్వహించింది. 36 నోట్ కౌంటింగ్ మెషీన్లతో పాటు వివిధ బ్యాంకులతో కలిసి రికవరీని పూర్తి చేసింది. పన్ను ఎగవేతపై దేశం చేస్తున్న వ్యతిరేక పోరాటానికి ఇది ఈ ఘటన బూస్ట్ ఇచ్చినట్లయింది.
కాగా ఇటీవల భువనేశ్వర్ లో జరిగిన ఆదాయపు పన్ను శాఖ 165వ వార్షికోత్సవంలో CBDT నుంచి ఈ బృందానికి సర్టిఫికెట్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డు లభించింది. ఈ జోష్ తో తమకు బాకీ ఉన్న పలు అధిక వాల్యూ కలిగిన అమౌంట్స్ తిరిగి పొందేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. 43 లక్షల కోట్లకు సంబంధించిన 5 వేల కేసులను ఈ విభాగం ప్రస్తుతం పర్యవేక్షిస్తోంది. ఆదాయపన్ను శాఖ చరిత్రలో ఇదొక కీలక మైలురాయిగా చెబుతున్నారు.


Click it and Unblock the Notifications