న్యూఢిల్లీ: ప్రభుత్వ పేరోల్ డేటా మంగళవారం విడుదలైంది. దీని ప్రకారం అక్టోబర్ 2019లో 6,29,914 మంది కొత్తగా ఉద్యోగంలో చేరారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇదే అత్యల్పం కావడమ గమనార్హం. గత కొంతకాలంగా ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఆర్థిక మందగమన పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. దీంతో ఇటీవల పార్మల్ ఎంప్లాయిమెంట్‌పై భారీగా ప్రభావం పడుతోంది.

ఏ నెలలో ఎంత... అక్టోబర్ కనిష్టం
ఆయా నెలలో ఎంతమంది కొత్తగా ఉద్యోగాల్లో చేరారో ఈపీఎఫ్ సబ్‌స్క్రైబర్ వెల్లడిస్తుంది. దీనిని పేరోల్ డేటా చూపిస్తుంది. దీని ప్రకారం అక్టోబర్ నెలలో జాబ్ క్రియేషన్ నెలల కనిష్టానికి చేరుకుంది. సెప్టెంబర్‌లో 8,79,746, ఆగస్ట్‌లో 9,62,378, జూలైలో 1.18 మిలియన్లు, జూన్‌లో 1.17 మిలియన్లు, మే నెలలో 1.06 మిలియన్లు, ఏప్రిల్‌లో 1.05 మిలియన్లుగా ఉంది.

జత కలిసిన ఉద్యోగులు
అక్టోబర్ నెలలో పేరోల్‌లో యాడ్ అయిన వారిలో 18-25 ఏళ్ల మధ్య ఉన్న వారు 3,46,561 వరకు ఉన్నారు. సాధారణంగా లేబర్ మార్కెట్లో వీరిని ఫ్రెష్ ఉద్యోగులుగా భావిస్తారు. అదే సెప్టెంబర్ నెలలో ఇది 1,36,000గా ఉంది. ఇటీవలి కాలంలో నిరుద్యోగ రేటు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఉపాధి కల్పన కూడా మందగించింది.

తగ్గిన లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు
పేరోల్ తాజా క్వార్టర్ ప్రకారం ఎక్కువ మంది ఉద్యోగం నుంచి పట్టణ ప్రాంతంలో తప్పుకుంటున్నారు. లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు (LFPR) అంతకుముందు డిసెంబర్‌లో 46.8 శాతంగా ఉండగా, ఈ ఏడాది మార్చికి అది 46.5 శాతానికి తగ్గింది. పట్టణ యువకుల్లో LFPR (15-29 ఏళ్లు) గత డిసెంబర్ నుంచి 38.2 శాతం నుంచి మార్చి క్వార్టర్‌కు 37.7 శాతం తగ్గింది.

మార్కెట్లోకి వస్తున్న మేరకు ఉద్యోగ కల్పన లేదు
అక్టోబర్ నెలలో ఈఫీఎఫ్ఓ పేరోల్‌లో యాడ్ అయిన వారు 1,46,719 మహిళా ఉద్యోగులు, 4,83,175 మంది పురుష ఉద్యోగులు ఉన్నారు. కొన్ని రంగాలలో డేటా సేకరణ ఆలస్యం కారణంగా పేరోల్ డేటా సవరిస్తారు. ప్రతి ఏడాది 12 మిలియన్ల మంది ఇండియన్ లేబర్ మార్కెట్‌లోకి వస్తున్నారు. కానీ ఉద్యోగ కల్పన మాత్రం ఆ మేరకు లేదు. టెలికం, ఆటో, మానుఫ్యాక్చరింగ్ వంటి రంగాలు ఇబ్బందలను ఎదుర్కొంటున్నాయి.


Click it and Unblock the Notifications